AnirudhKavyaWedding Reception: అనిరుధ్-కావ్య మారన్ రిసెప్షన్‌లో సెలబ్రిటీల సందడి.. మహేశ్ బాబు, కేన్ విలియమ్సన్, సీఎం రేవంత్ రెడ్డి హాజరు!.

AnirudhKavyaWedding Reception: అనిరుధ్-కావ్య మారన్ రిసెప్షన్‌లో సెలబ్రిటీల సందడి.. మహేశ్ బాబు, కేన్ విలియమ్సన్, సీఎం రేవంత్ రెడ్డి హాజరు!.

కోలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ( SRH ) ఫ్రాంచైజీ యజమాని కావ్య మారన్ వివాహ రిసెప్షన్ చైన్నైలో ఘనంగా నిర్వహించారు. నవంబర్ 11న గ్రీస్‌లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఒక్కటైన ఈ జంట..  ఈ రోజు(నవంబర్ 21) చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళ హోటల్‌లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహిస్తోంది. ఈ వేడుకకు సినీ, రాజకీయ, క్రికెట్ రంగాలకు చెందిన ప్రముఖులు తరలిరావడంతో చెన్నైలో సందడి  వాతావరణం నెలకొంది.

ఈ రిసెప్షన్‌కు టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు తన కుటుంబంతో కలిసి హాజరయ్యారు. హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీ కూడా వేడుకలో సందడి చేశారు. ఇక క్రికెట్ ప్రపంచం నుంచి న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్, మాజీ క్రికెటర్ డేనియల్ వెటోరీ, దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ తమ కుటుంబ సభ్యులతో కలిసి చెన్నై చేరుకున్నారు. శ్రీలంక దిగ్గజ క్రికెటర్, సన్‌రైజర్స్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. కొంత జంటకు విషెస్ తెలియజేశారు.

సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖుల రాకతో ఈ వేడుక మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి కూడా రిసెప్షన్‌కు హాజరయ్యారు. దర్శకుడు అట్లీ తన భార్య ప్రియతో కలిసి వేడుకకు వచ్చారు. నూతన దంపతులకు శుభాకాంక్షాలు తెలిపి ఆశీర్వదించారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ జంటకు అభినందనలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జీవితాంతం నమ్మకం, అన్యోన్యతతో కలిసి ఉండాలని ఆకాంక్షించారు.

ఇక అనిరుధ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రజనీకాంత్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, కావ్య తండ్రి కళానిధి మారన్‌తో కలిసి ఉన్న ఫొటోలను పంచుకోవడం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. మరోవైపు వివాహ వేడుక సందర్భంగా సన్ గ్రూప్ ఉద్యోగులకు ఈ జంట వెండి ఉంగరాలను బహుమతిగా ఇచ్చారు.. తమ ఆనందాన్ని ఉద్యోగులతో పంచుకునేలా ఈ బహుమతి ఇచ్చినట్లు సమాచారం.

ఒకే వేదికపై సినీ తారలు, రాజకీయ నేతలు, వ్యాపార ప్రముఖులతో పాటు అంతర్జాతీయ క్రికెట్ దిగ్గజాలు కలవడంతో అనిరుధ్-కావ్య రిసెప్షన్ ఒక భారీ సెలబ్రిటీ ఈవెంట్‌గా మారింది. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..