బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ముగింపు దశకు చేరుకుంటోంది. గ్రాండ్ ఫినాలేకు కేవలం కొద్దివారాల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో హౌస్‌లోని కంటెస్టెంట్ల మధ్య పోటీ తీవ్రమైంది. ఈ క్రమంలో 11వ వారం ఎలిమినేషన్ ప్రక్రియపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఫైనల్ రేసులో కంటెస్టెంట్లు తీవ్రంగా పోటీపడుతున్నారు..
ఉత్కంఠగా సాగుతున్న బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం మొత్తం 11 మంది నామినేట్ అయ్యారు. వారిలో త్రిగుణ్, ముఖేష్, అమన్, దేబ్జాని, రామకృష్ణ, వర్షిణి, రామ్ ప్రసాద్, వంశీ, సుధీర్, శివ, నీతు ఎలిమినేషన్ జోన్‌లో ఉన్నారు. సాధారణంగా ప్రతి వారం ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతుంటారు. అయితే ఈసారి షో నిర్వాహకులు 'డబుల్ ఎలిమినేషన్' ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫినాలే సమయం దగ్గర పడుతుండటంతో కంటెస్టెంట్ల సంఖ్యను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ ఇదే జరిగితే, శనివారం ఒకరు, ఆదివారం మరొకరు హౌస్ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. ప్రస్తుత ఓటింగ్ సరళిని బట్టి చూస్తే వర్షిణి, శివ, నీతు డేంజర్ జోన్ ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా వర్షిణికి బయట భారీగా ఫాలోయింగ్ ఉంది. ఆమె టైటిల్ విన్నర్ రేసులో నిలుస్తుందని చాలామంది భావించారు.
అయితే, అనూహ్యంగా ఆమె డేంజర్ జోన్‌లోకి రావడం చర్చనీయాంశమైంది. అటు శివ, నీతు కూడా తక్కువ ఓట్లతో ఎలిమినేషన్ ముంగిట ఉన్నట్లు చర్చ నడుస్తోంది. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోలో, ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపై ఆదివారం ఎపిసోడ్‌తో పూర్తి స్పష్టత రానుంది...
