రాజస్థాన్ రాష్ట్రానికి జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా నడిచింది. అధికార బీజేపీ పార్టీని చిత్తు చేస్తూ.. మెజార్టీ జిల్లాలను కైవసం చేసుకున్నది. బీజేపీ మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లోనూ కాంగ్రెస్ పట్టు నిలుపుకున్నది.
రాజస్థాన రాష్ట్రంలో మొత్తం 37 జిల్లా పరిషత్ లకు ఎన్నికలు జరగ్గా.. ఇందులో 25 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అధికార బీజేపీ పార్టీ కేవలం 8 స్థానాలకే పరిమితం అయ్యింది. ఇండిపెండెంట్లు మూడు స్థానాల్లో గెలుపొందారు.
ఇక 419 పంజాయితీ సమితుల్లో ఎన్నికలు నిర్వహించగా.. 213 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. బీజేపీ 85 స్థానాలకే పరిమితం అ్యింది. మరో 56 స్థానాల్లో స్వతంత్రులు విజయం సాధించారు. జైపూర్, జోధ్ పూర్, బికనీర్, భిల్వార, చిత్తోర్ గఢ్, సిరోహి, రాజ్ సమంద్, జలోర్ ప్రాంతాల్లో కాంగ్రెస్ గెలిచి.. బీజేపీ కంచుకోటలను బద్దలుకొట్టింది.
అజ్మీర్ స్థానంలో బీజేపీ గెలవగా.. ఉదయ్ పూర్ లో అతి స్వల్ప మెజార్టీ గట్టెక్కింది. రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మతోపాటు మంత్రుల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవటం సంచలనంగా మారింది. బీజేపీ గెలిచిన చోట్ల మెజార్టీ తక్కువగా ఉండటం.. కాంగ్రెస్ గెలిచిన చోట్ల మెజార్టీ భారీగా ఉండటం చూస్తుంటే.. బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా తెలుస్తుందని రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది.
రాజస్థాన రాష్ట్రం గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పూర్తిగా పట్టు సాధించింది. గత ఎన్నికల్లో జైపూర్, ఉధయ్ పూర్ వంటి చోట్ల ఓడిపోయిన కాంగ్రెస్.. జిల్లా పరిషత్ ఎన్నికల్లో తిరిగి ఆ స్థానాలను దక్కించుకున్నది. రాజస్థాన్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఫలితాలు వ్యతిరేకంగా ఉండటం బీజేపీ ఎదురుదెబ్బనే.. చాలా మంది మంత్రులు తమ కుటుంబ సభ్యులను రంగంలోకి దించినా ఓటమి తప్పలేదు. ఊహించని విధంగా ప్రజల తీర్పు ఉండటంతో.. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది.
