దీపావళి తర్వాతి నుంచి బంగారం, వెండి రేట్లు ఒక్కసారిగా పాతాళానికి పడిపోతున్నాయి. పెద్దలు చెప్పినట్లు పెరుగుడు విరుగుడు కొరకే అన్నట్లుగా బులియన్ మార్కెట్లలో రేట్ల పతనం ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే గడచిన 10 రోజుల కాలంలో 24 క్యారెట్ల తులం బంగారం రేటు ఏకంగా రూ.17వేల 400 తగ్గటం సామాన్య మధ్యతరగతి భారతీయులకు ఊరటను కలిగిస్తోంది. వడ్డీ రేట్ల పెంపు ఆశలతో బంగారంపై బెట్టింగ్ వేసివాళ్లు లేకపోవటంతో గతకొన్నాళ్లుగా కనిపించిన డిమాండ్ మాయమైపోతోంది. వాస్తవంగా ఆభరణాలు కొనుక్కునేవారి నుంచి మాత్రమే ప్రస్తుతం డిమాండ్ ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. షాపర్లకు ఇదొక సదవకాశంగా జ్యువెలర్లు అంటున్నారు.
హైదరాబాద్ లో 2026, నవంబర్ 20వ తేదీ బంగారం ధరలు ఇలా ఉన్నాయి :
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర : లక్షా 25 వేల 570 రూపాయలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర : లక్షా 15 వేల 100 రూపాయలు
18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర : 94 వేల 180 రూపాయలు
ఇక వెండి ధర విషయానికి వస్తే.. హైదరాబాద్ సిటీలో కిలో వెండి : లక్షా 75 వేల రూపాయలు
నవంబర్ 20న బంగారం రేట్లు తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు 512 రూపాయలు తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.12వేల 557గా కొనసాగుతోంది. దీంతో 10 గ్రాముల రేటు హైదారాబాదులో రూ.17వేలు తగ్గిన తర్వాత శుక్రవారం రోజున రూ.లక్షా 25వేల 570కి చేరుకుంది. అలాగే ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.11వేల 510గా కొనసాగుతోంది. అంటే 10 గ్రాముల బంగారం రేటు అంటే తులం రూ.లక్షా 15వేల 100 వద్ద అమ్మకాలు జరుగుతున్నాయి.
శుక్రవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. నవంబర్ 20, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.5వేలు తగ్గింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కూడా స్వచ్ఛమైన వెండి కేజీకి రూ.లక్షా 75వేలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.175 దగ్గర ఉంది. గడచిన 11 రోజుల్లో కేజీ వెండి ధర ఏకంగా రూ.30వేలు తగ్గటంతో.. భవిష్యత్తులో రేట్లు ఇంకా క్రాష్ అవ్వొచ్చని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
