హైదరాబాద్, వెలుగు: విదేశీ ప్రయాణాలు చేసే కస్టమర్ల కోసం ఎయిర్‌టెల్ ఈనెల 25 వరకు ట్రావెల్ వీక్ నిర్వహిస్తోంది. ఎయిర్‌టెల్ యాప్ ద్వారా విదేశాల్లో రోమింగ్సేవలు, వీసా సాయం, విదేశీ కరెన్సీ పొందే సదుపాయాలను అందిస్తోంది. 1,000 మంది ప్రీపెయిడ్, మరో 1,000 మంది పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్‌లపై 10 శాతం తగ్గింపు ఇవ్వనుంది. విదేశీ ప్రయాణం కోసం వీసా దరఖాస్తు చేసుకునే వారికి ఆట్లిస్ ద్వారా రూ.4,000 వరకు తగ్గింపు లభించనుంది. నియో మల్టీకరెన్సీ కార్డును అదనపు విదేశీ కరెన్సీ ఎక్స్చేంజ్ చార్జీ లేకుండా పొందవచ్చు. విదేశీ కరెన్సీని ఇంటికే తెప్పించుకునే సదుపాయం కూడా ఉంది.
