అక్వాన్ తుఫాన్ ఎఫెక్ట్.. హైదరాబాద్ నుంచి పలు రైళ్లు రద్దు

అక్వాన్ తుఫాన్ ఎఫెక్ట్.. హైదరాబాద్ నుంచి పలు రైళ్లు రద్దు

అక్వాన్  తుఫాన్  తీరం వైపు దూసుకొస్తోంది. ఇవాళ (గురువారం , నవంబర్ 19) ఏపీ,  ఒడిశా తీరాలను తాకే అవకాశం కనిపిస్తోంది.దీంతో ఏపీ, ఒడిశాలలో గంటకు 130 కిలో మీటర్ల వేగంతో  భారీనుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తుఫాన్ ఎఫెక్ట్ పై ఇప్పటికే ఏపీ, ఒడిశా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. మరోవైపు దక్షిణ మధ్య రైల్వే కూడా అలర్ట్ అయింది. అక్వాన్ తుఫాన్ ఎఫెక్ట్ ఉన్న ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు పలు రైళ్లను ఆలస్యంగా నడపుతోంది.  హైదరాబాద్ నుంచి కోల్‌కతా వెళ్లే రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు నవంబర్ 19, గురువారం నాడు షెడ్యూల్ కంటే కొన్ని గంటలు ఆలస్యంగా బయలుదేరతాయని దక్షిణ మధ్య రైల్వే (SCR) తెలిపింది.

►ALSO READ | GTA 5 నుంచి GTA 6 వరకు.. 13 ఏళ్లలో భారత్ ఎంత మారిందో తెలుసా? మోడీ పోస్ట్ వైరల్!