బంగ్లాదేశ్ లో మళ్లీ అల్లర్లు..మహ్మద్ యూనిస్ ఇంటికి.. నిప్పు పెట్టిన ఆందోళనకారులు

బంగ్లాదేశ్ లో మళ్లీ అల్లర్లు..మహ్మద్ యూనిస్ ఇంటికి.. నిప్పు పెట్టిన ఆందోళనకారులు

బంగ్లాదేశ్ లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. ఆదేశ మాజీ ప్రధాని షేక్ హసీనా తిరిగి స్వదేశానికి వస్తున్న క్రమంలో  దేశవ్యాప్తంగా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అధికార బీఎన్ పీ పార్టీ, ప్రతిపక్ష అవామీ  లీ గ్ కార్యకర్తల మధ్య ఈ ఘర్షణలు తలెత్తాయి.  పలు చోట్లు వాహనాలు,  ఇండ్లకు నిప్పు పెట్టారు ఆందోళనకారులు. ఈ ఘర్షణల్లో బంగ్లాదేశ్ సలహదారు అయిన మహ్మద్ యూనిస్ ఇంటికి నిప్పుపెట్టారు. కనీస వేతనాల కోసం బట్టల కార్మికుల నిరసనలు ,మాజీ ప్రధాని షేక్ హసీనా తిరిగి వచ్చే వార్తలతో ఈ వారం ప్రారంభంలో భారీ ఆందోళనలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా గురువారం (నవంబర్ 19)  పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. 

నిత్యం పెరుగుతున్న ద్రవ్యోల్బణం,జీవన వ్యయాలు వంటి ప్రధాన కారణాలతో ఆందోళనలు మొదలయ్యాయి. కార్మికుల నెలవారీ కనీస వేతనాన్ని ప్రస్తుత 12వేల500 టాకాల నుంచి 140% పెంచి, 30,000 టాకాలు అంటే రూ. 22 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. పదవీ కోల్పోయి దేశం నుంచి పారిపోయిన మాజీ ప్రధాని షేక్ హసీనా తిరిగి స్వదేశానికి వస్తున్నదన్న వార్తలు కూడా ఈ హింసకు ఆజ్యం పోశాయి. మంగళవారం జరిగిన నిరసనల్లో వేలాది మంది కార్మికులు  ప్రధాన రహదారులను దిగ్బంధించి, పోలీసులు,పారామిలిటరీ బలగాలతో ఘర్షణ దిగారు. ఈ ఘర్షణలకు పోలీసులు, బాష్పవాయువు, సౌండ్ గ్రెనేడ్లను ప్రయోగించారు.

నిరసనలతో  బంగ్లాదేశ్ లోని బట్టల పరిశ్రమలపై తీవ్ర ప్రభావం పడింది. సవార్, అశులియా ,గాజీపూర్ వంటి పారిశ్రామిక కేంద్రాలలోని వందలాది బట్టల కంపెనీలు మూతపడటంతో ఉత్పత్తి నిలిచిపోయింది.అదే సమయంలో పారిశ్రామిక ప్రాంతాలలో గస్తీకి బంగ్లాదేశ్ సరిహద్దు దళం (BGB) ప్లాటూన్‌లను మోహరించాల్సిన పరిస్ధితి ఏర్పడింది. 

ALSO READ : ముంబైలో దావుద్ ఇబ్రహీం ఇంటిని.. పునాదులతో సహా తీసి.. నేల మట్టం చేశారు

పదవి కోల్పయి దేశంనుంచి పారిపోయిన మాజీ ప్రధాని షేక్ హసీనా తిరిగి స్వదేశానికి వస్తున్నరన్న వార్తలతో ఈ ఘర్షణలు తలెత్తాయి.  గోపాల్ గంజ్, ఫరీద్ పూర్ తో చుట్టుపక్కల జిల్లాల్లో హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. రిపోర్టుల ప్రకారం..పోలీసులు,వాహనాలపై దాడులు, అవామీ లీగ్ కార్యకర్తలు ,అధికార బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) మద్దతుదారుల మధ్య ఘర్షణలు, హింస చోటుచేసుకున్నాయి.