నిండు ప్రాణానికి 3 లక్షలు విలువ కట్టి సెటిల్‌మెంట్.. పరిగి చత్రాజీ ఆసుపత్రిలో ఘటన

నిండు ప్రాణానికి 3 లక్షలు విలువ కట్టి సెటిల్‌మెంట్.. పరిగి చత్రాజీ ఆసుపత్రిలో ఘటన

పరిగి: వికారాబాద్ జిల్లా పరిగిలోని చత్రాజీ ఆసుపత్రిలో వైద్యం వికటించి 17 ఏళ్ల వైష్ణవి మృతి చెందడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కడుపు నొప్పి అని వస్తే అపెండిసైటిస్ ఆపరేషన్ చేసి, ఆపై న్యుమోనియా అంటూ 10 రోజులు తప్పుడు వైద్యం చేశారని బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. పరిస్థితి విషమించాక హైదరాబాద్ తీసుకెళ్లమని చేతులెత్తేయడంతోనే మార్గమధ్యంలో వైష్ణవి చనిపోయిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

తప్పు చేయకపోతే డాక్టర్ ఎందుకు పారిపోయారని ప్రశ్నిస్తూ మృతదేహంతో ఆందోళనకు దిగారు. అయితే ఉద్రిక్తతల నడుమ స్థానిక నాయకులు రంగప్రవేశం చేసి ఆసుపత్రి యాజమాన్యానికి, బాధితులకు మధ్య రాజీ కుదిర్చారు. ఓ నిండు ప్రాణానికి 3 లక్షల రూపాయలు విలువ కట్టి సెటిల్‌మెంట్ చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది.