కాలేజీ ముందే కొట్టుకున్న ఇంటర్ విద్యార్థులు.. రసాభాసగా మారిన జూనియర్ కాలేజీ వెల్కమ్ పార్టీ

కాలేజీ ముందే కొట్టుకున్న ఇంటర్ విద్యార్థులు.. రసాభాసగా మారిన జూనియర్ కాలేజీ వెల్కమ్ పార్టీ
  • కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలో ఘటన

మంచిర్యాల, వెలుగు: అప్పటివరకు వెల్కమ్ పార్టీలో ఉత్సాహంగా గడిపిన ఇంటర్ విద్యార్థులు కాలేజీ గేటు దాటగానే రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్నారు. ఈ సంఘటన కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో జరిగింది. బుధవారం సీనియర్ ఇంటర్ విద్యార్థులు, జూనియర్ ఇంటర్ విద్యార్థులకు వెల్కమ్ పార్టీ నిర్వహించారు. డీఐఈవోతో పాటు లోకల్ సర్పంచ్ గెస్టులుగా హాజరయ్యారు.

కేక్ కటింగ్, కల్చరల్ ప్రోగ్రామ్స్​తో విద్యార్థులు డాన్సులు చేస్తూ సంతోషంగా వేడుక జరుపుకున్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత కాలేజీ గేటు దాటగానే రోడ్డుపైనే రెండు గ్రూపులుగా విడిపోయి పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. దీంతో కాలేజీ ఎదుట ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. గేటు దగ్గర విద్యార్థుల గ్రూపుల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. కొంతమంది స్టూడెంట్లు మద్యం తాగి వచ్చినట్టు సమాచారం. పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపు చేశారు.