సర్టిఫికెట్లన్నా ఇప్పించండి: ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.కృష్ణయ్య డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

సర్టిఫికెట్లన్నా ఇప్పించండి: ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.కృష్ణయ్య డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • ఫీజు బకాయిల కోసం విద్యార్థులతో కలిసి ర్యాలీ

బషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాగ్, వెలుగు: రాష్ట్రంలోని 16 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్కాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బకాయిలను విడుదల చేయాలంటూ బీసీ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు పగిళ్ల సతీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో హైదరాబాద్ అబిడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి బషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చౌరస్తా వరకు విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.కృష్ణయ్య పాల్గొన్నారు.

ఫీజుల బకాయిల కారణంగా కాలేజీల్లో నిలిచిపోయిన 6 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లను తక్షణమే ఇప్పించాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎలాంటి షరతులు లేకుండా బకాయిలు చెల్లించాలని కోరారు.  ర్యాలీలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు నీలా వెంకటేష్, అనంతయ్య, రాజేందర్, శివ కుమార్ యాదవ్, మోదీ రాందేవ్,  భీమా రాజు, నిఖిల్ పటేల్, నరేష్ గౌడ్, అల్లం యాదవ్, బాలయ్య, వంశీ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.