కొడిమ్యాల, వెలుగు: త్వరలోనే రూ.200 కోట్లతో కొండగట్టులో ఘాట్ రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నట్లు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో ఏర్పాటుచేసిన చేయూత పింఛన్ మంజూరు పత్రాల అందజేత కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. మండలంలోని అర్హులైన 511 మంది లబ్ధిదారులకు ప్రోసిడిగ్స్అందజేశారు.
