శాతవాహన యూనివర్సిటీ క్యాంపస్‌‌‌‌‌‌‌‌లో చెట్లు కొట్టించింది కాంట్రాక్టరే: తేల్చిన ఇంటర్నల్ కమిటీ

శాతవాహన యూనివర్సిటీ క్యాంపస్‌‌‌‌‌‌‌‌లో చెట్లు కొట్టించింది కాంట్రాక్టరే: తేల్చిన ఇంటర్నల్ కమిటీ

కరీంనగర్, వెలుగు: కరీంనగర్‌‌‌‌‌‌‌‌లోని శాతవాహన యూనివర్సిటీ క్యాంపస్‌‌‌‌‌‌‌‌లో ఇటీవల జరిగిన భారీ చెట్ల నరికివేత వ్యవహారంలో క్యాంపస్ లో అభివృద్ధి పనులు చేస్తున్న కాంట్రాక్టరే బాధ్యుడిగా తేల్చారు. చెట్ల నరికివేతపై ఫిర్యాదులు అందడంతో వారం రోజులపాటు క్యాంపస్ లో పర్యటించిన డీఎఫ్వో సత్యనారాయణ, ఇతర ఫారెస్ట్ సిబ్బంది నరికిన చెట్ల విలువను సుమారు రూ.65 వేలు ఉంటుందని అంచనా వేశారు. ఈ మేరకు డీఎఫ్వో సత్యనారాయణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ సతీశ్​కుమార్ కు నోటీసులు అందజేశారు.

యూనివర్సిటీ నియమించిన ఇంటర్నల్ ఎంక్వైరీ కమిటీ విచారణ జరిపి, చెట్ల కొట్టివేతకు కాంట్రాక్టరే బాధ్యుడిగా తేల్చింది. అనుమతులు లేకుండా ఫారెస్టు డిపార్ట్ మెంట్ సదరు కాంట్రాక్టర్ కు సుమారు రూ.1.30 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు భారీ జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

నిబంధనలు అతిక్రమించిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, పనులు పూర్తయిన వెంటనే క్యాంపస్‌‌‌‌‌‌‌‌లో తిరిగి పెద్ద ఎత్తున మొక్కలు నాటి పచ్చదనాన్ని పునరుద్ధరిస్తామని వీసీ ప్రొఫెసర్ ఉమేశ్ కుమార్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సతీశ్ కుమార్ ఇప్పటికే స్పష్టం చేశారు.