బంగారం వెండి కొనాలనుకున్నా, తక్కువ రేటులో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా అలాంటి వారి పంట పండుతోంది. అవునండి బాబు బంగారం రేట్లు దీపావళి నుంచి ఊహించనంత స్థాయిలో తగ్గుతూ సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు ఆనందాన్ని కలిగిస్తోంది. కార్తీకమాసంలో శుభకార్యాలు, పెళ్లిళ్ల కోసం బంగారం కొందాం అనుకుంటున్న వారు ముందుగా తమ నగరాల్లో బుధవారం రేట్లను పరిశీలించి షాపింగ్ చేయటం బెటర్.
నవంబర్ 18న బంగారం రేట్లు తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు 278 రూపాయలు తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.13వేల 326గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.12వేల 215గా కొనసాగుతోంది.
బుధవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. నవంబర్ 18, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.5వేలు తగ్గింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కూడా స్వచ్ఛమైన వెండి కేజీకి రూ.లక్షా 85వేలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.185 దగ్గర ఉంది. భవిష్యత్తులో రేట్లు ఇంకా తగ్గొచ్చని బులియన్ వ్యాపారులు అంటున్నారు.
