జ్యోతిష్యం :400 ఏళ్ల తరువాత ఒకే నక్షత్రంలో మూడు గ్రహాలు.. ఐదు రాశుల వారికి రాజయోగం..

జ్యోతిష్యం :400 ఏళ్ల తరువాత  ఒకే నక్షత్రంలో మూడు గ్రహాలు.. ఐదు రాశుల వారికి రాజయోగం..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నవగ్రహాల కదలికలు.. ఏ గ్రహం ఏ సమయంలో ఏ నక్షత్రంలో సంచరిస్తుంది.. ఏ రాశిలో .. ఏ నక్షత్రంలో  యేయే గ్రహాలు కలిసి ఉన్నాయి అనే అంశాలను లెక్కించి జ్యోతిష్య పండితులు జాతకాలు చెబుతుంటారు.  అయితే 400 ఏళ్ల తరువాత మఖ నక్షత్రంలో త్రిగ్రహ కూటమి  సంచారం జరగబోతుంది.  కేతువు, కుజుడు, గురుడు మఖ నక్షత్రంలో సంచరించే సమయంలో   ఐదు రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయని చెబుతారు . ఈ మహా యోగం వలన   ఏ ఏ రాశుల వారికి ప్రయోజనాలను కలిగిస్తుందనే విషయాలను గురించి  తెలుసుకుందాం...!

  • కుజుడు : ధైర్యం, శక్తి, నాయకత్వ లక్షణాలు, భూమి మరియు పట్టుదలకు కారకుడు.
  •  కేతువు : ఆధ్యాత్మికత, వైరాగ్యం, మోక్షం మరియు లోతైన పరిశోధనలకు కారకుడు.
  • గురుడు: జ్ఞానం, ధర్మం, సంతానం, సంపద మరియు శుభ ఫలితాలకు కారకుడు

జ్యోతిష్య  గ్రహాల గమనం, నక్షత్ర మార్పులు మానవ జీవితాలపై, దేశ విదేశాల ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతాయని నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం, దాదాపు 400 సంవత్సరాల తర్వాత మఖ నక్షత్రంలో కుజుడు, కేతువు ,గురుడు ఒకే సమయంలో కలవడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

  • మఖ నక్షత్రంలోకుజుడు నవంబర్ 12 నుంచి డిసెంబర్​ 19  వరకు
  • మఖ నక్షత్రంలో కేతువు సంచారం  మార్చి 29 ప్రారంభమైంది.., డిసెంబర్ 5 వరకు కొనసాగుతాడు.
  • అక్టోబర్​ 31 మఖ నక్షత్రంలోకి ప్రవేశించిన గురుడు  2027 జనవరి 24 వరకు అదే నక్షత్రంలో సంచారం

ఈ మూడు గ్రహాల అరుదైన  కలయికవలన ఐదు  రాశుల వారికి ఊహించని ధనలాభం, అకస్మాత్తుగా కెరీర్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశం లభిస్తోంది. కుజుడు ధైర్యాన్ని, శక్తిని ప్రసాదిస్తే.. గురు గ్రహం ఐశ్వర్యాన్ని, సిరిసంపదలను ఇస్తుంది.

మేష రాశి:  మఖ నక్షత్రంలో మూడు గ్రహాల సంచారం వలన ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా వేతనం పెరిగే అవకాశాలున్నాయి. . వృత్తి.. ఉద్యోగాల రీత్యా విదేశాల్లో స్థిరపడే అవకాశం ఉంది.  కొద్ది ప్రయత్నంతో అత్యధికంగా లాభం పొందడం జరుగుతుంది. సమాజంలో  ప్రముఖులతో  సంబంధాలు ఏర్పడతాయి. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. .వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది.  నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ వస్తుంది.పెళ్లికోసం ఎదురు చూసేవారికి ఉన్నత కుటుంబంలో వారితో సంబందం కుదురుతుంది. కుటుంబంతో కలిసి ఆనందంగా పుణ్యక్షేత్రాలు లేదా ఆధ్యాత్మిక యాత్రలు చేసే సూచనలున్నాయి. 

 వృషభ రాశి:  కేతువు, కుజుడు, గురుడు.. ఈ మూడు గ్రహాలు  మఖ నక్షత్రంలో సంచారం వలన ఈ రాశి వారు కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. గత పెట్టుబడుల నుంచి అధికంగా లాభాలు అందుకుంటారు.  చాలా  ప్రయోజనకరంగా ఉండవచ్చని పండితులు చెబుతున్నారు. మీరు తీసుకొనే నిర్ణయాలతో చేపట్టిన ప్రతి పని విజయం చేకూరుతుంది.  కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.  గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు కలుగుతాయి.  మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడంతో పాటు అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేతి వృత్తుల వారికి  ఆశించిన దానికంటే ఎక్కువ ఆర్డర్లు వస్తాయి.  వ్యాపారాలు లాభాల బాటపడతాయి.  సంతాన యోగం కలుగుతుంది. నిరుద్యోగులు జాబ్​  ఆఫర్​  లెటర్స్​ అందుకుంటారు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలిసి వస్తాయి. 

 తులా రాశి : మఖ నక్షత్రంలో మూడు గ్రహాల సంచారం వలన ఈరాశి వారికి ఈ రాశి వారికి గ్రహబలం పెరుగుతుంది. వృత్తి.. ఉద్యోగాల రీత్యా విదేశాల్లో స్థిరపడే అవకాశం ఉంది.  కొద్ది ప్రయత్నంతో అత్యధికంగా లాభం పొందడం జరుగుతుంది. సమాజంలో  ప్రముఖులతో  సంబంధాలు ఏర్పడతాయి. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుందని పండితులు చెబుతున్నారు.వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది.  నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ వస్తుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించే అవకాశం ఉంది. పూర్వీకుల ఆస్తి కలసి వస్తుంది..పెళ్లికోసం ఎదురు చూసేవారికి ఉన్నత కుటుంబంలో వారితో సంబందం కుదురుతుంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య పండితులు  చెబుతున్నారు.

వృశ్చిక రాశి : మూడు గ్రహాలు ( కేతువు, కుజుడు, గురుడు) సంచరించడం వలలన ఈ రాశివారికి ఊహించని లాభాలుంటాయి. వృత్తి.. ఉద్యోగం.. వ్యాపారంలో  పురోగతి ఉంటుంది.  ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలతో పాటు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.   కొత్త ఆదాయ మార్గాలు అనుకోకుండా ఏర్పడటంతో సంపద పెరుగుతుందని పండితులు చెబుతున్నారు.  వ్యాపారస్తులు అధికంగా లాభాలు గడిస్తారు.  కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడటం వలన వ్యాపారం విస్తరించే అవకాశం ఉంది.   పెళ్లి.. ప్రేమ విషయంలో మొదట్లో కొన్ని అవాంతరాలు ఏర్పడినా... చివరికి మీరు అనుకున్నదే జరుగుతుంది. 

కుంభ రాశి:  మఖ నక్షత్రంలో త్రిగ్రహ కూటమి వలన ఈ రాశి వారికి ఎప్పటినుంచో ఆగిపోయిన పాత బకాయిలు చేతికి అందడంతో ఆర్థికంగా బలపడతారు. మీ శారీరక శక్తి, ఉత్సాహం రెట్టింపు అవుతాయి. కార్యాలయంలో మీ పనితీరుకు తగిన గుర్తింపు లభిస్తుంది. సమాజంలో కీర్తి.. గౌరవం.. ప్రతిష్ఠ పెరుగుతుంది. కొత్తగా ఆదాయ మార్గాలు ఏర్పడంతో .. ఇబ్బందులు తీరుతాయి.  కొన్ని కొత్త వనరులు ఏర్పడుతాయి.  కొత్త ఆలోచనలతో తీసుకున్న నిర్ణయాలు.. కొత్త ప్రణాళికలు కలసి వస్తాయి.  ఉద్యోగస్తులకు అధికారుల మద్దతు పుష్కలంగా ఉంటుంది.  ప్రమోషన్ రావడం.. వేతనం పెరగడం ... కొన్ని కొత్త బాధ్యతలు తీసుకోవలసి వస్తుంది.  వ్యాపారస్తులకు అన్ని విధాల కలసి వస్తుంది.  అనుకోకుండా లాభాలు వస్తాయి.  

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.