కార్తీకమాసం: అక్షయనవమి( నవంబర్18) ... ఉసిరి చెట్టుకు లక్ష్మీదేవి పూజ.. ఐశ్వర్యం రెట్టింపు..!

కార్తీకమాసం: అక్షయనవమి( నవంబర్18) ... ఉసిరి చెట్టుకు లక్ష్మీదేవి పూజ.. ఐశ్వర్యం రెట్టింపు..!

కార్తీకమాసం శివ కేశవులకు  పరమేశ్వరునికి, శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. ఈ మాసంలో శివ కేశవులను భక్తితో ఆరాధిస్తే అనంతమైన పుణ్యఫలం లభిస్తుందని పురాణాల ద్వారా తెలుస్తుంది.  కృతయుగం నుంచి ఈ సంప్రదాయం కొనసాగుందని రుషులు చెబుతున్నారు.  

కార్తీకమాసంలో  విష్ణుమూర్తి భార్య శ్రీలక్ష్మీదేవి  భూమిపైకి వచ్చినప్పుడు..శివకేశవులను పూజించాలనుకుందని పురాణాల ద్వారా తెలుస్తుంది.  . ఇద్దరినీ ఒకే సమయంలో పూజించడం ఎలా సాధ్యం అనుకున్న ఆ అమ్మవారు.. కార్తీకమాసం శుక్ల పక్షం నవమి రోజున ఉసిరి చెట్టును ఎంచుకుని అక్కడే పూజలు చేసింది. 

శివకేశవులు ఉసిరి చెట్టులో నివసిస్తారని గుర్తించిన అమ్మవారు.. ఉసిరి చెట్టును పూజించి శివకేశవుల ప్ర్రీతికి పాత్రమైందని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారు స్వయంగా ఉసిరి చెట్టుకింద వంటచేసి శివకేశవులకు నైవేద్యం సమర్పించిందని పండితులు చెబుతున్నారు. అందుకే  ఉసిరి చెట్టు కింద పూజ చేయాలని పండితులు చెబుతారు.

అక్షయనవమి ఎప్పుడు

2026లో అక్షయ నవమిని నవంబర్ 18వ తేదీ బుధవారం జరుపుకుంటారు. నవమి తిథి నవంబర్ 18న ఉదయం 6:04 గంటలకు ప్రారంభమై, నవంబర్ 19న ఉదయం 7:05 గంటలకు ముగుస్తుంది. పూజకు నవంబర్ 18న ఉదయం 6:46 నుంచి మధ్యాహ్నం 12:06 గంటల వరకు శుభ సమయంగా పరిగణిస్తారు.


అక్షయనవమి( నవంబర్​ 18) పూజా విధానం

  • అక్షయ నవమి నాడు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేయాలి. ఆరోజు ఉపవాసం ఉంటే మంచిది.
  • ఉసిరి చెట్టుపై గంగాజలాన్ని సమర్పించాలి.
  • చందనం, పువ్వులు వంటి వాటితో అలంకరించాలి.
  • ఉసిరి చెట్టు దగ్గర  ఆవు నెయ్యి దీపాన్ని వెలిగిస్తే మంచిది.
  • ఆ తర్వాత ఉసిరి చెట్టు చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేయాలి.
  • అక్షయ నవమి నాడు పరమేశ్వరుడిని,  విష్ణుమూర్తిని,లక్ష్మీదేవిని పూజిస్తే మంచిది.
  • విష్ణుమూర్తిని ఆరాధించేటప్పుడు “ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే మంత్రాన్ని జపించండి.
  • ఈరోజు దుస్తులు, ఆహారం వంటి వాటిని దానం చేస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది.

అక్షయ నవమి నాడు ఇలా చేస్తే మంచిది

  • అక్షయ నవమి నాడు శ్రీహరిని ఆరాధించి జామకాయలను నైవేద్యంగా పెట్టాలి.
  • అలాగే జామకాయలను దానం చేస్తే కూడా ఎంతో మంచి జరుగుతుంది.
  • నిరుపేదలకు లేదా బ్రాహ్మణులకు జామ చెట్టు కింద భోజనం పెడితే కూడా శుభ ఫలితాలు ఎదురవుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు.
  • అక్షయ నవమి నాడు పూర్వికులను స్మరించుకుని బట్టలు, దుప్పట్లు వంటి వాటిని దానం చేయాలి
  • ఇంటి ఆవరణలో ఉత్తర దిశలో కాని..తూర్పు దిశలో కాని   ఉసిరి మొక్కలను నాటితే  లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం కలుగుతుంది. 

కార్తీక మాసంలో శివ కేశవులకు భేదం లేదని భావిస్తూ, ఏకకాలంలో అభిషేకాలు, విశేషాలంకరణలు మరియు పూజలు చేస్తారు.ఈ మాసంలో నదీ స్నానాలు, ఆలయాల్లో లేదా తులసి చెట్టు వద్ద దీపాలు వెలిగించడం, ఉసిరికాయపై దీపం పెట్టడం విశేష ఫలితాన్నిస్తుంది.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం...

►ALSO READ | ఆధ్యాత్మికం: జీవితంలో పెద్దశత్రువు ఎవరో తెలుసా.. దానిని దూరంగా ఉంచాలంటే చేయాల్సింది ఇదే..!