రియల్ స్టార్ శ్రీహరి ఇంట పెళ్లి సందడి.. ఓ ఇంటివాడు కాబోతున్న పెద్ద కుమారుడు!

రియల్ స్టార్ శ్రీహరి ఇంట పెళ్లి సందడి.. ఓ ఇంటివాడు కాబోతున్న పెద్ద కుమారుడు!

టాలీవుడ్‌లో రియల్ స్టార్‌గా చెరగని ముద్ర వేసిన దివంగత నటుడు శ్రీహరి కుటుంబంలో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి.  ఆయన పెద్ద కుమారుడు శశాంక్ శ్రీహరి త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు.  ఆయన పెళ్లికి సంబంధించిన ఆసక్తికర విషయాలు కూడా ఒక్కొక్కటిగా బయటకు రావడంతో శ్రీహరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ విషెస్ చెబుతున్నారు.

శ్రీహరి, ఆయన భార్య నటి డిస్కో శాంతి దంపతులకు ఇద్దరు కుమారులు. వారిలో పెద్దవాడైన శశాంక్ శ్రీహరి ఇప్పుడు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సంజన అనే యువతితో ఆయన వివాహం జరగనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇరు కుటుంబాలకు చాలాకాలంగా పరిచయం, సాన్నిహిత్యం ఉండటంతో పెద్దలు ఈ సంబంధాన్ని కుదిర్చినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి పనులకు కూడా శ్రీకారం చుట్టినట్లు ప్రచారం జరుగుతోంది.

వచ్చే ఏడాది ఫిబ్రవరి 20న శశాంక్, సంజనల నిశ్చితార్థ వేడుక నిర్వహించేందుకు ముహూర్తం నిర్ణయించినట్లు సమాచారం. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం వివాహ తేదీని ప్రకటించే అవకాశం ఉందని టాక్.

ALSO READ : 418 OTT Horror: మూసి ఉంచిన 418 గదిలో ఏముంది?

అయితే ఈ వార్తలపై శ్రీహరి కుటుంబం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాబోయే వధువు సంజనకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది. శ్రీహరి అభిమానులు ఈ శుభవార్త నిజమవ్వాలని కోరుకుంటుండగా.. కుటుంబం నుంచి వచ్చే అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.