ఫీజు చెల్లించలేదని ముక్కు నేలకు రాయించి ఎండకు నిలబెట్టారు.. జగిత్యాల జిల్లాలో అమానుష ఘటన

ఫీజు చెల్లించలేదని ముక్కు నేలకు రాయించి ఎండకు నిలబెట్టారు.. జగిత్యాల జిల్లాలో అమానుష ఘటన

జగిత్యాల జిల్లాలో అమానుష ఘటన జరిగింది. ఫీజు చెల్లించలేదని ముక్కు నేలకు రాయించి విద్యార్థిని ఎండకు నిలబెట్టిన ఘటన తీవ్ర వివాదాస్పదంగా మారింది. రాయికల్ విశ్వశాంతి పబ్లిక్ స్కూల్ యాజమాన్యం తమ కుమారుడిపై అమానుషంగా ప్రవర్తించిందని విద్యార్థి తండ్రి తీవ్ర ఆరోపణలు చేశారు. 

తమ రొడుకును ముక్కు నేలకు రాయించి ఎండలో నిలబెట్టారని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు విద్యార్థి తండ్రి. శిక్ష కారణంగా విద్యార్థి కాలుకు తీవ్ర గాయాలయ్యాయని ఆరోపించారు. భయంతో బాలుడు పాఠశాలకు వెళ్లేందుకు నిరాకరిస్తున్నట్లు తెలిపారు. 

2026 విద్యా సంవత్సరం ఫీజు చెల్లించలేదనే కారణంతో వేధింపులకు గురిచేశారని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. 2024లో పదో తరగతి పూర్తి చేసిన కుమార్తెకు ఇప్పటికీ మార్కుల మెమో ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు. పాఠశాల యాజమాన్యం తీరుపై ప్రజవానిలో జిల్లా విద్యాశాఖ అధికారికి విన్నవించారు. 

ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుమార్తె మార్కుల మెమో, కుమారుడి టీసీ ఇప్పించాలని డీఈఓకు విజ్ఞప్తి చేశారు.