రూ.3 వేల కోట్లతో 4 లక్షల పెన్షన్లు.. మెదక్ జిల్లాలో పెన్షన్ పత్రాలు అందజేసిన మంత్రి వివేక్

రూ.3 వేల కోట్లతో 4 లక్షల పెన్షన్లు.. మెదక్ జిల్లాలో పెన్షన్ పత్రాలు అందజేసిన మంత్రి వివేక్

కార్మిక, మైనింగ్ శాఖా మంత్రి వివేక్ వెంకటస్వామి సోమవారం (2026 నవంబర్ 16) మెదక్ జిల్లాలో పర్యటించారు. నర్సాపూర్  నియోజకవర్గంలో  లబ్ధిదారులకు  నూతనంగా మంజూరైన పెన్షన్ పత్రాలను అందజేశారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి..  వికలాంగులు, ఒంటరి మహిళలు  పెన్షన్ ల కోసం ఎదురుచూస్తున్నారని.. అందరికీ పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు చెప్పారు.  నాలుగు లక్షల పెన్షన్లు ప్రకటించడం జరిగిందని.. 3 వేల  కోట్ల రూపాయలతో  అందరికీ పెన్షన్ లు ఇస్తున్నట్లు చెప్పారు. 

 మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణం కల్పిస్తున్నామని..  కేవలం నర్సాపూర్ నియోజకవర్గంలో పది కోట్ల రూపాయలతో వడ్డినేని రుణాలు ఇవ్వడం జరిగిందని చెప్పారు.  21 ఆర్టీసీ బస్సులు మహిళల ఆధ్వర్యంలో నడుసితున్నాయని తెలిపారు.

నర్సాపూర్లో మహిళల ద్వారా పెట్రోల్ బంకు త్వరలో స్టార్ట్ చేస్తామని అన్నారు. 46 వేలకోట్ల రూపాయలు బకాయిలు చెల్లించడానికి ప్రభుత్వం ప్రయత్నం కృషి చేస్తోందన్నారు.  కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చినా ప్రకారం, ఎల్నినో ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అన్నారు.  నవంబర్19న ముఖ్యమంత్రి సిద్ధిపేటకు వస్తున్నారని తెలిపారు. 

ఎల్ నినో పరిస్థితుల్లో వరి పండిస్తే నీళ్లు లేక ఇబ్బందులు ఎదురవుతాయని రైతులకు సూచించారు. ఆరు తడి పంటలు, కూరగయాలు సాగు చేయాలని సూచించారు.