ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు

 ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. వీణవంకలో నమోదైన కేసులో దాఖలు చేసిన పిటిషన్ ను 2026 నవంబర్ 16న హైకోర్టు కొట్టివేసింది. 

కరీంనగర్ సీపీని దూషించారనే ఫిర్యాదు మేరకు వీణవంకలో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో వాయిస్ శాంపిల్ ఇవ్వాలని కౌశిక్ రెడ్డికి పోలీసుల నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఇరువైపులా వాదనల అనంతరం పాడి కౌశిక్ రెడ్డి పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది.