చేదు అనుకుని పక్కన పెడుతున్నారా ? మెంతులతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలిస్తే అస్సలు వదలరు!

చేదు అనుకుని పక్కన పెడుతున్నారా ? మెంతులతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలిస్తే అస్సలు వదలరు!

'చేదు' అనే వంకతో మెంతుల్ని తినడానికి పెద్దగా ఇష్టపడరు చాలామంది. కానీ, ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో గుణాలు మెంతుల్లో ఉన్నాయి. జ్వరం, జలుబు, షుగర్, కాన్సర్, జాండీస్ తో పాటు చర్మం, జుట్టు సమస్యలకి కూడా వీటితో చెక్ పెట్టొచ్చు. అందుకే డైలీ వీటిని తినాలంటున్నారు డాక్టర్లు.

తలనొప్పి, కళ్లు తిరగడం, కడుపులో తిప్పుతున్నట్లు ఉంటే రెండు టీ స్పూన్ల మెంతుల్ని నీళ్లలో ఉడికించాలి. ఆ నీళ్లు కాస్త చల్లారాక తాగితే సమస్యలన్నీ దూరమవుతాయి. అలాగే గ్యాస్, ఎసిడిటి లాంటి సమస్యలుంటే అర టీ స్పూన్ మెంతుల పౌడర్ ని మజ్జిగలో కలిపి తాగాలి.

ALSO READ : రాగి సంకటి నుంచి నాటుకోడి పులుసు దాకా.. 

తలలో చుండ్రు ఎక్కువగా ఉంటే రెండు టీ స్పూన్ల మెంతుల్ని నానబెట్టి పేస్ట్ లా చేయాలి. ఓ కప్పు పెరుగులో ఈ పేస్ట్ని కలిపి తలకు అప్లై చేస్తే చుండ్రు పోతుంది.. జుట్టు మెరుస్తుంది. ప్రతి రోజు ఉదయం ఒక టీ స్పూన్ మెంతులు పొడి తీసుకుంటే బీపీ కంట్రోల్ లో ఉంటుంది. మెంతులు బాడీలో చెడు కొవ్వును తగ్గిస్తాయి. మెంతుల్ని వరుసగా 15 రోజులు తింటే వెన్నునొప్పి తగ్గుతుంది. మెంతులే కాదు ప్రతి రోజూ మెంతికూర తినడం వల్ల కూడా అంతే లాభం ఉంటుంది.