కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఉన్న రోజును కోటి సోమవారమని అంటారు... అలాంటి పవిత్రమైన రోజు ఈ ఏడాది నవంబర్16న వచ్చింది. శ్రవణ నక్షత్రం కలిసివస్తున్న సోమవారం రోజు ఉపవాసం చేస్తే కోటి సోమవారాలు ఉపవాస ఫలితం దక్కుతుందని పండితులు చెబుతున్నారు.
ఈ 2026 సంవత్సరం కోటిసోమవారం నవంబర్ 16 వ తేది సోమవారం వచ్చింది. ఈ కార్తీకమాసంలో శ్రవణ నక్షత్రం నవంబర్ 15 ఆదివారం రాత్రి 11:28 గంటలకు ప్రారంభమై.. నవంబర్ 17మంగళవారం తెల్లవారుజామున 02:17 గంటల వరకు ఉంటుంది..అంటే సోమవారం ( నవంబర్ 16 వ తేది) అంతా శ్రవణ నక్షత్రం ఉంటుంది.
మన పురాణాలు మరియు సంప్రదాయాల ప్రకారం ఏ తిథి అయిన సూర్యోదయం తర్వాతే ప్రామానికంగా తీసుకోవాలి. కావున ఈ 2026 సంవత్సరం కోటి సోమవారం నవంబర్ 16 వ తేది సోమవారం రోజున జరుపుకోవాలి.
- ఈ కోటి సోమవారం రోజున శివాలయ సందర్శనం, అభిషేకం, ఉపవాసం లేదా నక్తం లేదా ఏకభుక్తం ఎవరి శక్తి అనుసారం వారు చేస్తే మంచిది.
- ఈ రోజు దీపారాధన, ఆకాశదీప దర్శనం, దానాలు, ధర్మాలు చేస్తే ఆ ఫలితం రెట్టింపు అవుతుందని శాస్త్ర ప్రవచనం.
- కార్తీక మాసం శివుడుకి అత్యంత ప్రీతిపాత్రమైనది . ఈ కార్తీకమాసంలో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో అన్ని సోమవారాలు ఉపవాసం ఉండి దైవాన్ని కొలుస్తారు. కోటి సోమవారం రోజు ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుంది
- అందుకే ఈ నవంబర్ 16 కోటి సోమవారం రోజు ఉపవాసం ఉండి ఆ పరమేశ్వరుడి అనుగ్రహం పొందండి.
- కోటి సోమవారం అయిన రోజున ఉదయం శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకం చేసి ఉపవాసం ఉండాలి. సాయంత్రం ప్రదోష కాలమందు భక్తుల ఇంట్లో దీపారాధన చేసి పూజ ముగించుకుని శివాలయానికి వెళ్లి మరోసారి ఈశ్వరుడిని దర్శించుకోవాలి. ఆలయంలో దీపారాధన చేయాలి.
- అనంతరం ఇంటికి వచ్చి భోజనం చేస్తే కోటి సోమవారాలు ఉపవాసమున్న పుణ్య ఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి.
- కోటి సోమవారం నాడు ఉపవాసం ఉండి నియమ నిష్టలతో కోటి సోమవారం దీక్ష పూర్తి చేస్తే స్వామివారి అనుగ్రహం కలుగుతుంది
- కోటి సోమవారాల రోజున ఓం నమఃశివాయ పంచాక్షరితో భక్తి ప్రపత్తులతో శివునికి ఉపవాసం చేస్తే అనంత పుణ్యఫలాలు కలుగుతాయని విశ్వాసం. ఆలయాల్లో శివునికి అభిషేకం చేయించడం, నేతితో దీపమెలిగించడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయి. పార్వతీపరమేశ్వరులను స్తుతిస్తూ నేతితో దీపమెలిగించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. పుణ్యఫలం చేకూరుతుందని పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
