జ్యోతిష్యశాస్త్ర ప్రకారం అరుదైన గ్రహస్థితి నవంబర్ 15 నెలకొంది. ఈస్థితి వారం రోజుల పాటు కొనసాగుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కొన్ని గ్రహాల కలయిన వలన బుధాదిత్య రాజయోగం, గురు-మంగళ యోగం, లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడ్డాయి. ఈ మూడు యోగాల ప్రభావంతో నాలుగు రాశుల వారికి అదృష్ట యోగం కలుగుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ రాశుల వివరాల గురించి తెలుసుకుందాం. .!
- చంద్రుడు మకరం, కుంభం, మీన రాశులలో సంచరిస్తుండగా బుధాదిత్య రాజయోగం
- కుజుడు, గురుడు, కేతువులు సింహ రాశి లో సంచారం వలన గురు-మంగళ యోగం
- బుధుడు , శుక్రుడు ఒకే రాశిలో కలవడం వల్ల లక్ష్మీనారాయణ రాజయోగం
ఈ గ్రహాల కదలికల ప్రభావం వల్ల నవంబర్ 15 నుంచి వారం రోజులపాటు నాలుగు రాశుల వారికి (మేషం, కన్య, వృశ్చికం, మీన) వారికి అత్యంత లాభదాయకంగా మారుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
మేష రాశి: ఈ రాశి వారికి బుధాదిత్య రాజయోగం, గురు-మంగళ యోగం, లక్ష్మీనారాయణ రాజయోగం వ్యాపారంలో ఊహించని లాభాలు కలుగుతాయి. వారం రోజుల పాటు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. అన్ని విధాలా అనుకూలంగా ఉంది. మీరు తలపెట్టిన పనుల్లో అడ్డంకులు తొలగిపోయి సజావుగా సాగుతాయి. ఆర్థికంగా ఈ వారం మీకు చాలా ఉత్సాహకరంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది.విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగం ఎదురు చూసే వారు గుడ్ న్యూస్ వింటారు. ఎప్పటి నుంచి పెండింగ్ లో ఉన్న పనులు పరిష్కారమవుతాయి. జాయింట్ వ్యాపారాలు కలసివస్తాయి. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్ లభిస్తుంది. అధికారుల నుంచి ప్రశంసలు అందుకోవడమే కాకుండా.. విదేశీ ప్రయాణం చేసే అవకాశం ఉంది. పూర్వీకుల ఆస్తి రావడంతో కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టే అవకాశం ఉంది. పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి ఆశించిన సంబంధం కుదురుతుంది. చేతి వృత్తుల వారికి అధికంగా ఆర్డర్లు రావడంతో కష్టాలు తీరతాయని పండితులు చెబుతున్నారు.
కన్య రాశి: నవంబర్ 15న ఏర్పడిన గ్రహస్థితితో ఏర్పడిన మూడు యోగాల వలన ఈ రాశి వారి కెరీర్‌లో ఊహించని మార్పులు కలుగుతాయి. ప్రతి విషయంలో కూడా సానుకూల ఫలితాలు ఉంటాయి. ధన, సంపదల్లో వృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు సహోద్యోగుల నుంచి పూర్తి సహకారం అందుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన ఆర్థిక లావాదేవీలు పూర్తవుతాయి. సమాజంలో కీర్తి.. గౌరవం.. ప్రతిష్ఠ పెరుగుతుంది. కొత్తగా ఆదాయ మార్గాలు ఏర్పడంతో .. ఇబ్బందులు తీరుతాయి. కొన్ని కొత్త వనరులు ఏర్పడుతాయి. కొత్త ఆలోచనలతో తీసుకున్న నిర్ణయాలు.. కొత్త ప్రణాళికలు కలసి వస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల మద్దతు పుష్కలంగా ఉంటుంది. ప్రమోషన్ రావడం.. వేతనం పెరగడం ... కొన్ని కొత్త బాధ్యతలు తీసుకోవలసి వస్తుంది. వ్యాపారస్తులకు అన్ని విధాల కలసి వస్తుంది. అనుకోకుండా లాభాలు వస్తాయి
వృశ్చిక రాశి: బుధాదిత్య రాజయోగం, గురు-మంగళ యోగం, లక్ష్మీనారాయణ రాజయోగం వలన ఈ రాశి వారికి వారం రోజుల పాటు ( నవంబర్ 15 నుంచి) కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. మనసులోని ఆందోళనలు తొలగిపోయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.అన్నీ రంగాల్లో విజయం సాధిస్తారు ప్రతి పనిలోనూ మీ వెంటే విజయం ఉంటుంది. విదేశాలకు వెళ్లే వారికి అనుకూలంగా ఉండటమే కాకుండా.. లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎంతో కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. వ్యాపారస్తులకు ఒక్కసారిగా... అనుకోకుండా లాభాలు వస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. తోబుట్టువుల మధ్య విబేధాలు తొలగి ఆస్తి సమస్యలు పరిష్కారమవుతాయి. . మీ పాత బంధువులను కలిసే అవకాశంతోపాటు.. . కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి.
మీన రాశి: నవంబర్ 15న ఏర్పడిన మూడు యోగాల వలన ఈ రాశి వారికి ఏళ్ల నాటి కలలు నిజమయ్యే సమయం ఆసన్నమయిందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.. గత కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయిన పనులు వేగంగా పుంజుకుంటాయి.సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థికంగా బలపడటంతో... గతంలో ఉన్న బాకీల నుంచి విముక్తి పొందుతారు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలతో పాటు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వృత్తి పరంగా పురోగతి ఉంటుంది. వ్యాపారస్తులు లాభాల బాటలో పయనిస్తారు. కొత్తగా పెట్టుబడులు పెడితే మూడు రెట్లు లాభాలు వస్తాయని పండితులు సూచిస్తున్నారు. కొత్తగా భూమి లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబసభ్యులతో కలిసి పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. విహార యాత్రలు చేయడంతో కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
