ఎన్విడియా చిప్ ల వివాదం.. ఏడాది క్రితమే అలిస్ హువాంగ్ రాజీనామా చేసింది..మెగాస్పీడ్ సంచలన ప్రకటన

ఎన్విడియా చిప్ ల వివాదం.. ఏడాది క్రితమే అలిస్ హువాంగ్ రాజీనామా చేసింది..మెగాస్పీడ్ సంచలన ప్రకటన

చైనా కంపెనీలకు అడ్వాన్స్డ్ ఎన్విడియా చిప్‌లను అక్రమంగా బదిలీ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సింగపూర్‌ క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థ మెగాస్పీడ్ ఇంటర్నేషనల్ కీలక ప్రకటన చేసింది. ఎన్విడియా మాజీ చీఫ్ జెన్సన్ హువాంగ్‌తో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్న ఆలిస్ హువాంగ్ గత ఏడాదే కంపెనీని వీడినట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఆమెకు సంస్థలో ఎలాంటి బాధ్యతలు లేవని స్పష్టం చేసింది. అదే సమయంలో ఆరోపణలపై సమగ్ర విచారణ కోసం న్యాయసలహాదారులను నియమించినట్లు ప్రకటించింది.

అమెరికా ఎగుమతి నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించి, అడ్వాన్స్డ్ ఎన్విడియా చిప్‌లను చైనా కంపెనీలకు తరలించిందనే ఆరోపణలపై మెగాస్పీడ్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై సింగపూర్ ప్రభుత్వం కూడా దర్యాప్తు చేస్తోంది. సర్వర్ల కొనుగోలుకు సంబంధించి తప్పుడు ప్రకటనలు చేశారనే ఆరోపణలతో 2025 ఫిబ్రవరిలో విచారణ ప్రారంభించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ఈ కేసులో గతంలో మెగాస్పీడ్ సీఈఓ, చైర్‌పర్సన్‌గా ఉన్న ఆలిస్ హువాంగ్‌ను కూడా అధికారులు ప్రశ్నించారు. గత ఏడాది ఆమె పాస్‌పోర్టును నిలిపివేశారు. అయితే  అలిస్ హువాంగ్  పై తప్పుడు ప్రచారం జరిగిందని, ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు  లేవని  కంపెనీ వర్గాలు తెలిపాయి. 

ఆలిస్ హువాంగ్ చైనా గూఢచారిగా వ్యవహరించారనే అనుమానాలు  అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. అయితే ఈ ఆరోపణలు ఇంకా నిర్ధారణ కాలేదని అమెరికా అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచె స్పష్టం చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ విషయంపై స్పష్టత లేదని చెరప్పారు. బీజింగ్ ఈ ఆరోపణలను నిరాధారమైనవిగా ఇప్పటికే ఖండించింది.

మరోవైపు, మెగాస్పీడ్ తన వ్యాపారంపై క్లారిటీ ఇచ్చింది. తన వ్యాపారం చట్టబద్ధంగానే సాగుతోందని, అక్రమ చిప్ బదిలీలకు ఆధారాలు లేవని గతంలోనూ ప్రకటించింది. అమెరికా వాణిజ్య శాఖ అధికారుల తనిఖీలకు సహకరించామని, తదుపరి విచారణకూ సిద్ధంగా ఉన్నామని తెలిపింది. కంపెనీ ఆర్థిక లావాదేవీలు, యాజమాన్య మార్పులపై కూడా పరిశీలన కొనసాగుతోంది.