ఆరోగ్యం కోసం వ్యాయామం చేయడం అవసరం. ఫిజికల్ వర్క్ లేనివాళ్లు జిమ్ కెళ్లి ఫిట్ నెస్ కాపాడుకోవడం సిటీ లైఫ్ లో కామన్. బయట గ్రౌండ్ కు వెళ్లి వాకింగ్, రన్నింగ్ చేయలేని వాళ్లు ట్రెడ్ మిల్ ను ఉపయోగిస్తుంటారు. అయితే ట్రెడ్ మిల్ వినియోగించేటప్పుడు ఏమరుపాటుగా వ్యవహరిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో చెప్పే ఘటన ఇది.
ఇండోనేషియాలోని పాంటియానాక్‌లోని ఒక జిమ్‌లో జరిగిన భయంకరమైన ప్రమాదం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. 22 ఏళ్ల యువతి ట్రెడ్‌మిల్‌పై వ్యాయామం చేస్తూ బ్యాలెన్స్ కోల్పోయి మూడో ఫ్లోర్ నుంచి పడిపోయింది. ట్రెడ్ మిల్ పై స్లిప్ అయిన ఆమె.. ఒక తోపు తోసినట్లుగా.. విసిరేసినట్లుగా వెనుక ఉన్న కిటికీ ద్వారా కింద పడి మరణించింది.
యువతి మూడవ అంతస్తులో ఉన్న ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తుతూ ఉంది. కొంతసేపటి తర్వాత తన ముఖం తుడుచుకోవడానికి టవల్ తీసుకుంటూ బ్యాలెన్స్ కోల్పోయింది. ట్రెడ్‌మిల్ మాత్రం నడుస్తూనే ఉండటంతో ఆమె వెనక్కి లాగినట్లయింది. ట్రెడ్‌మిల్ వెనుక తెరిచి ఉన్న కిటికీ ద్వారా అమాంతం కిందికి పడిపోయింది. చూస్తుండగానే సెకన్ల వ్యవధిలో జరిగింది ఈ ఘటన.
పైనుంచి కాంక్రీట్ నేలపై పడటంతో తీవ్రంగా గాయపడింది. చుట్టూ ఉన్నవారు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. ఆమె ఆసుపత్రిలోనే మరణించింది.
ఈ ఘటన 2024లో జరిగింది. జిమ్‌లోని సెక్యూరిటీ కెమెరాలో ఆమె టవల్‌తో ముఖం తుడుచుకుంటూ బ్యాలెన్స్ కోల్పోయి కిటికీ ద్వారా పడిపోయిన దృశ్యం రికార్డ్ అయ్యాయి. ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది.
ఈ ప్రమాదం జిమ్‌లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గుర్తు చేస్తుంది. ముఖ్యంగా ట్రెడ్ మిల్ పై ఉండగా ఏ మాత్రం ఏమరుపాటు ఉండకూడదని హెచ్చరిస్తున్నారు. అదే క్రమంలో కిటికీలకు జాలీ లాంటి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నారు. ఈ ఘటన చూసిన తర్వాతైనా భద్రతా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ట్రెడ్‌మిల్‌పై నుంచి కిటికీలోంచి పడి 22 ఏళ్ల యువతి మృతి ఇండోనేషియాలోని ఓ జిమ్లో ట్రెడ్‌మిల్‌పై వ్యాయామం చేస్తుండగా 22 ఏళ్ల యువతి వెనక్కి పడిపోయి, అదుపుతప్పి మూడో అంతస్తులోని తెరిచి ఉన్న కిటికీలోంచి కిందపడింది. కిటికీకి కేవలం కొన్ని అంగుళాల దూరంలోనే ట్రెడ్‌మిల్ ఏర్పాటు చేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. తీవ్ర గాయాలపాలైన యువతి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. #Indonesia #GymAccident #Treadmill #TragicDeath
— ముచ్చట్లు | Stories • Voices • Views (@muchatlu_) November 14, 2026
