OTT Romantic Movie: ఓటీటీలోకి క్రేజీ మూవీ.. కాలేజీలో 2 వేల మంది అమ్మాయిలకి ఒక్కడే అబ్బాయి

OTT Romantic Movie: ఓటీటీలోకి క్రేజీ మూవీ.. కాలేజీలో 2 వేల మంది అమ్మాయిలకి ఒక్కడే అబ్బాయి

‘కోర్ట్’ సినిమాతో ఓవర్‌నైట్ క్రేజ్ సంపాదించుకున్న యంగ్ బ్యూటీ శ్రీదేవి ఆపళ్ల నటించిన యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘హైకూ’ ఓటీటీ లవర్స్‌ను అలరించేందుకు రెడీ అయిపోయింది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్‌పై మేకర్స్ నుంచి అఫీషియల్ అప్‌డేట్ వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 20, శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ కానుంది. మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఏంటంటే.. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుంది. కాలేజీ క్రష్, లవ్, బ్రేకప్, ఎమోషన్స్‌తో యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యేలా తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి మ్యాజిక్ చేయబోతోంది? ఇంతకీ ‘హైకూ’ కథేంటి? థియేటర్లలో ఈ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? ఓ లుక్కేద్దాం!

హైకూ థియేటర్ రెస్పాన్స్..

‘హైకూ’ మూవీ అక్టోబర్ 23, 2026న తమిళం, తెలుగు భాషల్లో థియేటర్లలో విడుదలైంది. యువరాజ్ చినసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఏగన్ హీరోగా, ‘కోర్ట్’ ఫేమ్ శ్రీదేవి ఆపళ్ల హీరోయిన్‌గా నటించింది. ఫెమినా జార్జ్ మరో కీలక పాత్రలో కనిపించింది. విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి సిద్ధు కుమార్ సంగీతం అందించారు. ‘హైకూ’కు థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కాలేజీ కామెడీ, యూత్‌ఫుల్ లవ్ ట్రాక్ ఆకట్టుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోలేకపోయింది. 

హైకూ స్టోరీ ఏంటంటే?

మనోహర్ అలియాస్ మనో (ఏగన్) ఓ కాలేజీ కుర్రాడు. ఓ అల్లరి పని కారణంగా కాలేజీ నుంచి సస్పెండ్ కావడంతో అమ్మాయిల కాలేజీలో చేరతాడు. అక్కడ రెండు వేల మంది అమ్మాయిల మధ్య ఒక్కడే అబ్బాయిగా ఎన్నో ఫన్నీ సిచ్యువేషన్స్ ఎదుర్కొంటాడు. ఈ క్రమంలో పవళకొడి (శ్రీదేవి ఆపళ్ల)తో పరిచయం ప్రేమగా మారుతుంది.

అయితే ఉద్యోగాల కోసం వేర్వేరు ప్రాంతాలకు వెళ్లడంతో ఇద్దరి మధ్య దూరం పెరిగి బ్రేకప్ అవుతుంది. కొన్నేళ్ల తర్వాత మనో జీవితంలోకి ట్రైనీగా నివేదా (ఫెమినా జార్జ్) ఎంట్రీ ఇస్తుంది. ఆమెతో పరిచయం ప్రేమగా మారుతుంది. మరి పాత ప్రేమ జ్ఞాపకాలు, కొత్త ప్రేమ మధ్య మనో ఎలాంటి సంఘర్షణకు గురయ్యాడు? చివరకు అతని జీవితంలో ఎవరికి చోటు దక్కింది? అన్నదే మిగతా కథ.