కీసరలో భారీ అగ్నిప్రమాదం..గడ్డి లోడుతో వెళ్తున్న డీసీఎం దగ్ధం...

కీసరలో భారీ అగ్నిప్రమాదం..గడ్డి లోడుతో వెళ్తున్న డీసీఎం దగ్ధం...

కీసరలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గడ్డి లోడుతో వెళ్తున్న డీసీఎం వాహనం దగ్ధం అయ్యింది. ఆదివారం ( నవంబర్ 15 ) ఉదయం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. కీసరలో డీసీఎం వాహనం గడ్డి లోడుతో వెళ్తుండగా కరెంటు వైర్లు తగిలి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మెదక్ నుంచి కీసరకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

కరెంటు వైర్లు తగలడంతో డీసీఎంలో ఉన్న గడ్డి పూర్తిగా దగ్ధమైంది.మెదక్ నుంచి కీసరకు చెందిన రాజిరెడ్డి వ్యవసాయ పొలం దగ్గరికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఘటన జరిగిన సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించి గడ్డి మొత్తం దగ్ధమైంది.

ఈ ఘటనపై ఫైర్ సిబ్బందికి సమాచారం  అందించారు స్థానికులు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. డీసీఎంలో ఉన్న గడ్డి మొత్తం కాలి బూడిద అవ్వడంతో ఆస్తి నష్టం భారీగా జరిగిందని తెలుస్తోంది.