బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడుతోంది. ఈ క్రమంలో తెలంగాణ, ఏపీకి ముప్పు పొంచి ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఈ తుఫాను అక్వాన్ అని పేరు పెట్టింది ఐఎండీ. ఈ తుపాను ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణించి నవంబర్ 20 నాటికి ఉత్తర కోస్తాంధ్ర తీరాన్ని దాటే ఉందని... దీని ప్రభావంతో నవంబర్ 20 నుంచి 22 వరకు తూర్పు తెలంగాణ, దక్షిణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. 21, 22 తేదీల్లో ఇతర జిల్లాల్లో కూడా తుపాను ప్రభావం ఉంటుందని తెలిపింది వాతావరణ శాఖ.
తుఫాను ప్రభావం ఏపీలోని కోస్తా తీరంపై ఎక్కువగా ఉంటుందని తెలిపింది వాతావరణ శాఖ. రానున్న 24 గంటల్లో తుఫానుగా బలపడనున్న వాయుగుండం మంగళవారం నాటికి తీవ్ర తుఫానుగా బలపడుతుందని తెలిపింది.
ఉత్తర కోస్తా మీదుగా తుఫాను తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. వాయుగుండం తుఫానుగా బలపడే సమయంలో సముద్రంలో ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయని... సాయంత్రం లోపు మత్స్యకారులు తీరానికి రావాలని హెచ్చరించింది ఐఎండీ.
