ప్రతి వారం సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఓటీటీ ప్రియులను అలరిస్తున్న నెట్‌ఫ్లిక్స్.. ఈ వీకెండ్ కూడా క్రేజీ కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. థియేటర్లలో ఇప్పటికే సందడి చేసిన సినిమాలతో పాటు ఉత్కంఠ రేపే క్రైమ్ థ్రిల్లర్స్, కడుపుబ్బా నవ్వించే కామెడీ షోలు, ఆసక్తికరమైన వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీకెండ్‌లో ఇంట్లోనే ఉంటూ మంచి ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునేవారికి ఇవి బెస్ట్ ఛాయిస్ కానున్నాయి. మరి ఈ శనివారం, ఆదివారం నెట్‌ఫ్లిక్స్‌లో అస్సలు మిస్ కాకూడని ఆ 7 సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏంటో.. వాటి కథలు, IMDb రేటింగ్స్‌తో సహా చూసేద్దాం!
1. రణబాలి – IMDb రేటింగ్: 7.3/10
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'రణబాలి'. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 19వ శతాబ్దపు బ్రిటిష్ పాలన నేపథ్యంలో సాగుతుంది.
కథ: తీవ్ర కరువు, ఆకలితో ప్రజలు అల్లాడుతున్న సమయంలో బ్రిటిష్ పాలకుల దోపిడీకి వ్యతిరేకంగా ఓ వీరుడు తిరుగుబాటు చేస్తాడు. ఆంగ్లేయుల అణచివేతను ఎదిరిస్తూ రణబాలి సాగించిన పోరాటమే ఈ సినిమా కథాంశం. విజయ్ మాస్ యాక్షన్, రష్మిక నటన ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
Karuvu rakshasudni muginchadaniki osthunnadu… Ranabaali 🏇🔥 https://t.co/rkNLEc35U6
— Netflix India South (@Netflix_INSouth) November 13, 2026
2. దాయరా – IMDb రేటింగ్: 7.1/10
బాలీవుడ్ స్టార్ కరీనా కపూర్ ఖాన్, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'దాయరా'. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా వాస్తవ ఘటనల స్ఫూర్తితో రూపొందింది.
కథ విషయానికొస్తే.. సంచలనం సృష్టించిన అత్యాచారం, హత్య కేసులో నిందితులుగా ఉన్న నలుగురు వ్యక్తులు పోలీస్ ఎన్‌కౌంటర్‌లో హతమవుతారు. అయితే ఈ ఎన్‌కౌంటర్‌కు నాయకత్వం వహించిన పోలీస్ అధికారి రామన్ కుమార్ (పృథ్వీరాజ్) తీరుపై అనుమానాలు మొదలవుతాయి. నిజంగానే ఆ ఎన్‌కౌంటర్ నిబంధనల ప్రకారం జరిగిందా? లేక దాని వెనుక ఏదైనా రహస్యం దాగి ఉందా? అన్న కోణంలో అంతర్గత విచారణ అధికారి అజూనీ కోహ్లీ (కరీనా) రంగంలోకి దిగుతుంది. ఈ క్రమంలో వెలుగులోకి వచ్చే విస్తుపోయే నిజాలు, న్యాయం కోసం జరిగే పోరాటం ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచుతాయి. క్రైమ్, సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఈ సినిమా మంచి వీకెండ్ ఛాయిస్.
Sathyavum systevum thammilulla poraattathil aaru jeykkum? 👀 https://t.co/19ARJTbOP2
— Netflix India South (@Netflix_INSouth) November 13, 2026
3. మేడమ్ ఇన్‌స్పెక్టర్ – IMDb రేటింగ్: 5.9/10
క్రైమ్ ఇన్వెస్టిగేషన్, సీరియల్ కిల్లర్ మిస్టరీలతో సాగే థ్రిల్లర్ సిరీస్ 'మేడమ్ ఇన్‌స్పెక్టర్'. సందీప్తా సేన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్‌లో మొత్తం 7 ఎపిసోడ్లు ఉన్నాయి.
కథ: రెండో పెళ్లికి సిద్ధమవుతున్న మహిళలు వరుసగా హత్యలకు గురవుతుంటారు. ఈ హత్యల వెనుక ఉన్నది ఎవరు? వాటి మధ్య సంబంధమేంటి? అన్నది ఇన్‌స్పెక్టర్ చిత్రాకు సవాలుగా మారుతుంది. ఒక్కో ఆధారాన్ని ఛేదిస్తూ హంతకుడి కోసం ఆమె చేసే దర్యాప్తు ఆసక్తికరంగా సాగుతుంది. ట్విస్టులు, ఉత్కంఠభరితమైన ఇన్వెస్టిగేషన్ ఇష్టపడేవారికి ఈ సిరీస్ మంచి ఎంపిక.
4. నెవర్ సరెండర్– IMDb రేటింగ్: 6.0 / 10
యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిపిన ఇండోనేషియన్ థ్రిల్లర్ మూవీ 'నెవర్ సరెండర్'. సిధార్థ తాతా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లుక్మన్ సర్ది ప్రధాన పాత్రలో నటించారు.
కథ: సెంట్రల్ జావాలోని ఓ మారుమూల గ్రామంలో నివసించే మాజీ సైనికుడి జీవితంలోకి అతడి ఇద్దరు మనవళ్లు వస్తారు. అదే సమయంలో ఓ ప్రమాదకరమైన నేరగాళ్ల ముఠా అతడి ఇంటిపై దాడి చేస్తుంది. దీంతో మనవళ్లను కాపాడేందుకు ఆ మాజీ సైనికుడు మరోసారి తన పోరాట నైపుణ్యాలను బయటకు తీస్తాడు. కుటుంబాన్ని రక్షించుకునేందుకు అతడు చేసే పోరాటం, యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ.
When a deadly gang descends on his remote home, a guilt-ridden veteran and the estranged grandchildren he barely knows must unite to survive. Indonesian film #NeverSurrender (2026) by #SidhartaTata, now streaming on @NetflixIndia. https://t.co/VZ6LAdIMp9
— CinemaRare (@CinemaRareIN) November 12, 2026
5. ది బాడీ – IMDb రేటింగ్: 7.6/10
హారర్, సైకలాజికల్ మిస్టరీ అంశాలతో తెరకెక్కిన ఇంగ్లిష్ వెబ్ సిరీస్ 'ది బాడీ'. క్విన్ షెపర్డ్ రూపొందించిన ఈ సిరీస్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది.
కథ: క్యాథలిక్ స్కూల్‌లోని అమ్మాయిల డ్యాన్స్ టీమ్ చుట్టూ కథ తిరుగుతుంది. హాలోవీన్ రాత్రి జరిగిన ఓ విచిత్రమైన సంఘటన తర్వాత అమ్మాయిలకు భవిష్యత్తును సూచించే వింత దర్శనాలు కనిపిస్తాయి. ఓ విద్యార్థిని కోమాలోకి వెళ్లడం, ఆమెకు అతీంద్రియ శక్తులున్నాయనే ప్రచారం మొదలవడంతో అనేక రహస్యాలు తెరపైకి వస్తాయి. అసలు ఆ సంఘటనల వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? అన్నది సిరీస్‌లో ఆసక్తికరంగా చూపించారు. హారర్, సస్పెన్స్ ఇష్టపడేవారికి ఇది మంచి ఛాయిస్.
The Body is now on Netflix. Amen. https://t.co/4IDtak55S9
— Netflix (@netflix) November 14, 2026
6. జురాసిక్ వరల్డ్ రీబర్త్ – IMDb రేటింగ్: 5.8/10
డైనోసార్ల ప్రపంచంలోకి మరోసారి తీసుకెళ్లే హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ 'జురాసిక్ వరల్డ్ రీబర్త్'. స్కార్లెట్ జోహన్సన్, మహర్షలా అలీ, జోనాథన్ బెయిలీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి గారెత్ ఎడ్వర్డ్స్ దర్శకత్వం వహించారు.
కథ: 'జురాసిక్ వరల్డ్: డొమినియన్' తర్వాత ఐదేళ్లకు కథ మొదలవుతుంది. ఓ ప్రత్యేక మిషన్ కోసం ప్రమాదకరమైన ద్వీపానికి వెళ్లిన బృందం అక్కడి భారీ డైనోసార్ల మధ్య చిక్కుకుంటుంది. ప్రాణాలను కాపాడుకుంటూ మిషన్ పూర్తి చేసేందుకు వారు చేసే సాహసమే ఈ సినిమా ప్రధాన కథాంశం. భారీ యాక్షన్ సన్నివేశాలు, డైనోసార్ల విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అడ్వెంచర్ సినిమాలు ఇష్టపడేవారికి మంచి వీకెండ్ ఎంటర్‌టైనర్.
7. ఢింఢోరా: సీజన్ 1 & 2– IMDb రేటింగ్: 8.7/10
కామెడీ వెబ్ సిరీస్
నవ్వులు పూయించే కామెడీ వెబ్ సిరీస్‌లను ఇష్టపడేవారికి 'ఢింఢోరా' మంచి ఎంటర్‌టైనర్. ప్రముఖ యూట్యూబర్ భువన్ బామ్ నటించి రూపొందించిన ఈ సిరీస్ ఓ మధ్యతరగతి కుటుంబంలో జరిగే సరదా సంఘటనల నేపథ్యంలో సాగుతుంది.
కథ: ఓ సాధారణ కుటుంబానికి అనుకోకుండా లాటరీ తగలడంతో వారి జీవితాల్లో ఊహించని పరిణామాలు మొదలవుతాయి. ఈ వార్త బయటకు రావడం, అదే సమయంలో కుటుంబ పెద్దకు ప్రమాదం జరగడంతో ఇంట్లో గందరగోళం నెలకొంటుంది. డబ్బు, ఆశలు, కుటుంబ బంధాలు, అపార్థాల మధ్య సాగే కామెడీ ప్రేక్షకులను నవ్విస్తుంది. భువన్ బామ్ విభిన్న పాత్రల్లో కనిపించడం ఈ సిరీస్‌కు ప్రత్యేక ఆకర్షణ.
Sab dukh dard side rakh ke, aajao kal Dhindora peetne. Trailer drops tomorrow! Khabar phaila do🥁📢🔥 #DhindoraS2 https://t.co/yPgoAxEvBT
— Netflix India (@NetflixIndia) November 12, 2026
