Om Trailer Review: ట్రైలర్‌తోనే టాక్ ఆఫ్ ది టౌన్‌గా ధనుష్ ‘ఓం’.. అసలు స్టోరీ తెలిస్తే మైండ్ బ్లాకే!

Om Trailer Review: ట్రైలర్‌తోనే టాక్ ఆఫ్ ది టౌన్‌గా ధనుష్ ‘ఓం’.. అసలు స్టోరీ తెలిస్తే మైండ్ బ్లాకే!

‘Om’ ట్రైలర్‌తోనే ఆడియన్స్‌లో క్యూరియాసిటీ పెంచేసాడు హీరో ధనుష్. యాక్షన్, ఎమోషన్స్, పవర్‌ఫుల్ క్యారెక్టర్స్.. ఇలా అన్ని ఎలిమెంట్స్‌ను కలగలిపి కట్ చేసిన ‘Om – Operation Mole’ ట్రైలర్ ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల ఒకే సినిమాలో కనిపించనుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇంతకీ ట్రైలర్‌లో ఉన్న స్పెషల్ ఎలిమెంట్స్ ఏంటి? ఈ సినిమా ఎందుకు ఇంత బజ్ క్రియేట్ చేస్తోంది? అనే అంశాలపై ఓ లుక్కేద్దాం..

ధనుష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘Om – Operation Mole’ ట్రైలర్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. కథలోని కీలక అంశాలను ఒక్కొక్కటిగా పరిచయం చేస్తూ, పాత్రల స్వభావాలను ఆసక్తికరంగా రివీల్ చేసిన విధానం ఆకట్టుకుంటోంది. ట్రైలర్ కట్ చూస్తుంటే యాక్షన్, ఎమోషన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌కు సినిమాలో పెద్దపీట వేసినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రైలర్ గురించి చర్చ మొదలవడంతో మూవీపై హైప్ మరింత పెరుగుతోంది.

దర్శకుడి మార్క్.. కథనంలో కొత్తదనం!

ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. ‘అమరన్’ సినిమాతో తన టేకింగ్, ఎమోషనల్ స్టోరీటెల్లింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన.. ఇప్పుడు ఓం సినిమాతో మరో ఆసక్తికరమైన కథాంశంతో వస్తున్నారు. పాత్రలను డిజైన్ చేసే విధానం, భావోద్వేగాలను సహజంగా తెరపై ఆవిష్కరించే శైలి ఆయన ప్రత్యేకత. ‘Om – Operation Mole’ ట్రైలర్‌లోనూ ఆయన మార్క్ కనిపిస్తుండటంతో సినిమా ఎలా ఉండబోతోందన్న క్యూరియాసిటీ పెరుగుతోంది. ముఖ్యంగా రేసీ స్క్రీన్‌ప్లే, ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఎలివేషన్స్ సినిమాకు ప్లస్ అయ్యేలా కనిపిస్తున్నాయి.

ధనుష్–మమ్ముట్టి.. స్క్రీన్‌పై బిగ్ ట్రీట్!

ఈ సినిమాకు మరో బిగ్గెస్ట్ అట్రాక్షన్ ధనుష్, మమ్ముట్టి కాంబినేషన్. తమ విలక్షణమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ ఇద్దరు స్టార్స్ ఒకే తెరపై కనిపించనుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ధనుష్ తన నేచురల్ పెర్ఫార్మెన్స్‌తో, మమ్ముట్టి తన పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో సినిమాకు మరింత వెయిట్ తీసుకొచ్చేలా కనిపిస్తున్నారు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

సాయి పల్లవి, శ్రీలీల.. పాత్రల్లో సరికొత్త షేడ్స్!

ఇక సాయి పల్లవి ఈ సినిమాలో మరో మెయిన్ అట్ట్రాక్షన్ గా నిలుస్తోంది. సహజమైన నటనతో ఎమోషనల్ సీన్స్‌లో అద్భుతంగా ఒదిగిపోయే ఆమె.. ఈసారి మరింత ఇంటెన్స్ పాత్రలో కనిపించబోతున్నట్లు ట్రైలర్ హింట్ ఇస్తోంది. మరోవైపు శ్రీలీల కూడా తన రెగ్యులర్ పాత్రలకు భిన్నమైన లుక్, బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకుంటోంది. ఈ నలుగురు మెయిన్ స్టార్స్ పాత్రలు కథలో ఎలాంటి మలుపులు తీసుకురాబోతున్నాయన్నది ఆసక్తిని పెంచుతోంది.

యాక్షన్ ఎలివేషన్స్.. అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్!

ట్రైలర్‌లో అక్కడక్కడా ‘పుష్ప’, ‘ధురంధర్’ తరహా మాస్, యాక్షన్ వైబ్స్ కనిపిస్తున్నప్పటికీ.. దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి తనదైన కథనంతో ప్రత్యేకమైన ట్రీట్ ఇవ్వబోతున్నట్లు అనిపిస్తోంది. ఇక సాయి అభ్యంకర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌లోని ఇంటెన్సిటీని నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లింది. పవర్‌ఫుల్ మ్యూజిక్, స్టైలిష్ విజువల్స్, క్యారెక్టర్ ఎలివేషన్స్ అన్నీ కలిసి ట్రైలర్‌కు మంచి ఇంపాక్ట్ తీసుకొచ్చాయి.

కథ విషయానికి వస్తే:

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను నడిపించే శక్తివంతమైన వ్యక్తి బర్మా కార్తికేయన్ పాత్రలో మమ్ముట్టి కనిపిస్తున్నారు. ఈ నెట్‌వర్క్‌లోకి అండర్‌కవర్ పోలీస్‌గా ధనుష్ ప్రవేశిస్తారు. మరోవైపు ఐపీఎస్ అధికారి నిత్యారెడ్డిగా సాయి పల్లవి ఈ ఆపరేషన్‌కు నాయకత్వం వహిస్తారు. స్మగ్లింగ్ మాఫియాను అంతం చేసేందుకు ఆమె చేపట్టే ‘ఆపరేషన్ మోల్’ చుట్టూ కథలో ఉత్కంఠ నెలకొంటుంది.  ధనుష్ పాత్రలో రెండు విభిన్న కోణాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు పోలీస్ అధికారిగా తన బాధ్యతను నిర్వర్తిస్తూనే.. మరోవైపు స్మగ్లింగ్ ముఠాలో కలిసిపోయి వారి నమ్మకాన్ని పొందాల్సిన పరిస్థితి ఆయన పాత్రలో ఆసక్తిని పెంచుతోంది. ఇక మమ్ముట్టి ప్రతినాయక ఛాయలున్న శక్తివంతమైన పాత్రలో కనిపించడం సినిమాకు మరో ప్రధాన బలం. వీరిద్దరి మధ్య సాగే పోరాటం వెండితెరపై ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. శ్రీలీల ధనుష్ భార్య రోజా పాత్రలో కనిపించనున్నారు. భర్త చేసే రహస్య ఆపరేషన్ కారణంగా కుటుంబం ఎదుర్కొనే పరిస్థితులు, భావోద్వేగ సంఘర్షణలు ఆమె పాత్రకు ప్రాధాన్యతను తీసుకొచ్చేలా ఉన్నాయి. సాయి పల్లవి మాత్రం పవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా తనదైన ముద్ర వేయనున్నారు. ఈ ఇద్దరు హీరోయిన్లు కూడా కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా కథలో కీలకమైన పాత్రలు పోషిస్తున్నట్లు ట్రైలర్ స్పష్టం చేస్తోంది.

మొత్తానికి.. ట్రైలర్‌తోనే భారీ బజ్ క్రియేట్ చేసిన ‘Om – Operation Mole’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో చూడాలి. స్టార్ కాస్ట్, దర్శకుడి టేకింగ్, యాక్షన్ అండ్ ఎమోషన్స్ కలిస్తే వెండితెరపై అదిరిపోయే సినిమా అవుతుందనే అంచనాలు మొదలయ్యాయి!