అమెరికాలోని న్యూ ఆర్లీన్స్ సమీపంలో మిసిసిపీ నదిపై నవంబర్ 13న నౌకల ఢీ ఘటన జరిగింది. సుమారు 500 అడుగుల పొడవున్న ‘అట్లాంటిక్ ఆస్ఫాల్ట్’ ట్యాంకర్ స్టీరింగ్ కంట్రోల్ కోల్పోయి, నిలిపి ఉంచిన ‘అమెరికన్ హెరిటేజ్’ క్రూయిజ్ షిప్ ను ఢీకొట్టింది. క్రూయిజ్ నౌకలో ప్రయాణికులు, సిబ్బందితో కలిపి సుమారు 180 నుంచి 190 మంది ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా అనే వివరాలు తెలియాల్సి ఉంది.
మిసిసిపీ నదిలో లంగరు వేసి ఉన్న క్రూయిజ్ షిప్‌ను ఓ సరుకు రవాణా నౌక ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో క్రూయిజ్ షిప్ ఒకవైపునకు ఒరిగిపోయింది. వెంటనే స్పందించిన అధికారులు అందులో ఉన్న సుమారు 130 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అట్లాంటిక్ ఆస్ఫాల్ట్ అనే ట్యాంకర్, అమెరికన్ హెరిటేజ్ అనే క్రూయిజ్ షిప్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఢీకొన్న ధాటికి క్రూయిజ్ షిప్ ఒకవైపునకు ఒరిగిపోవడంతో అందులోకి నీరు చేరడం ప్రారంభమైంది.
ఈ ఘటనలో నదిలో ప్రయాణిస్తున్న పడవలో ఉన్న 32 మందికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గల్లంతు కాలేదని అధికారులు వెల్లడించారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా ప్రాణనష్టం లేకపోవడాన్ని అధికారులు 'మిసిసిపీ నదిపై జరిగిన అద్భుతం'గా అభివర్ణించారు.
NEW VIDEO: A passenger onboard the American Heritage River Cruise ship recorded this video of the oil tanker headed directly for them. This footage is unbelievable. ABSOLUTELY TERRIFYING! https://t.co/T51lTUynSz
— Eric Spracklen 🇺🇸 (@EricSpracklen) November 13, 2026
ప్రమాదానికి అసలు కారణం ఏమిటనేది ఇంకా తెలియరాలేదు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే నౌకను నడిపే సమయంలో స్టీరింగ్‌పై నియంత్రణ కోల్పోయి ఉండొచ్చని యూఎస్ కోస్ట్ గార్డ్ కెప్టెన్ మెలానీ బర్న్‌హామ్ తెలిపారు.
వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు
శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. క్రూయిజ్ షిప్‌లోకి నీరు చేరుతుండటంతో ప్రయాణికులను బయటకు తీసుకురావడానికి వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు.
పోర్ట్ ఆఫ్ న్యూ ఓర్లీన్స్ వివరాల ప్రకారం, ప్రమాదం జరిగిన సమయంలో అమెరికన్ హెరిటేజ్ నౌకలో సుమారు 129 మంది ప్రయాణికులు ఉన్నారు. నౌక ఒకవైపునకు ఒరిగిపోవడంతో ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు రావడం ప్రారంభించారు. టగ్‌బోట్లు, పోలీసులు, ఇతర అత్యవసర సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
గాలింపు, సహాయక చర్యలకు ఎలాంటి ఆటంకం కలగకుండా అధికారులు మిసిసిపీ నదిలో నౌకల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. న్యూ ఓర్లీన్స్ మేయర్ హెలెనా మోరెనో మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన సహాయక సిబ్బంది వల్లే ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురాగలిగామని తెలిపారు. ఎవరూ గల్లంతు కాకపోవడం చాలా సంతోషకరమని చెప్పారు.
ప్రమాదంపై ట్రంప్ స్పందన
ఈ రెస్క్యూ ఆపరేషన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. ప్రయాణికులను సురక్షితంగా కాపాడిన సహాయక బృందాలను ప్రశంసిస్తూ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి మార్క్‌వేన్ ముల్లిన్ మాట్లాడుతూ.. స్థానిక అధికారుల సహాయక చర్యలకు యూఎస్ కోస్ట్ గార్డ్ కూడా సహకరించిందని తెలిపారు. లూసియానా గవర్నర్ జెఫ్ లాండ్రీ సైతం ఈ ఘటనలో భారీ సంఖ్యలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడటాన్ని 'మిసిసిపీపై జరిగిన అద్భుతం'గా అభివర్ణించారు. నదిలో నౌకల ప్రయాణం ఎప్పటినుంచో సురక్షితంగా కొనసాగుతోందని, ఈ ప్రమాదంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపిస్తామని చెప్పారు.
Dramatic footage: A tanker slammed into a docked river cruise ship near the Port of New Orleans. The ship capsized, people went into the water, but everyone has been accounted for with no critical injuries. https://t.co/RcMXrNKIXT
— MR VALLENZ (@Mr_Vallenz) November 13, 2026
ప్రమాదాన్ని కళ్లారా చూసిన ప్రత్యక్ష సాక్షి
ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన జేమీ హోల్‌ఫోర్డ్ తన అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు. ట్యాంకర్ ఢీకొన్న తర్వాత క్రూయిజ్ షిప్ డాక్‌ను ఢీకొట్టడం తాను చూశానని తెలిపారు. ఆ సమయంలో వచ్చిన శబ్దం భయంకరంగా ఉందని, భారీ ఇనుప వస్తువులు నలిగిపోతున్నట్లు అనిపించిందని చెప్పారు. నౌక ఒకవైపునకు ఒరిగి నీటిలో మునిగిపోతున్న సమయంలో ప్రయాణికులు, సిబ్బంది భయంతో అరుస్తూ, ఏడుస్తూ బయటకు రావడానికి ప్రయత్నించారని తెలిపారు.
150 మంది ప్రయాణించే సామర్థ్యం
అమెరికన్ క్రూజ్ లైన్స్‌కు చెందిన అమెరికన్ హెరిటేజ్ నౌకను 2015లో నిర్మించారు. ఈ నౌకలో గరిష్ఠంగా 150 మంది ప్రయాణికులు ప్రయాణించొచ్చు. ఈ క్రూయిజ్ షిప్‌లో రెస్టారెంట్, ఫిట్‌నెస్ సెంటర్, మూడు ప్రత్యేక లాంజ్‌లు ఉన్నాయి. లూసియానా, మిసిసిపీ ప్రాంతాల్లోని నదీ తీరాలను సందర్శించే ఎనిమిది రోజుల క్రూయిజ్ యాత్రను ముగించుకుని ఈ నౌక న్యూ ఓర్లీన్స్‌కి చేరింది. ప్రస్తుతం ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
