మైక్రోసాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు టెక్ సంక్షోభం..74 దేశాల్లో నిలిచిన సేవలు

మైక్రోసాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  టెక్ సంక్షోభం..74 దేశాల్లో నిలిచిన సేవలు
  • ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లుక్, టీమ్స్, కోపైలట్ బంద్
  • ఆఫీసులు, బ్యాంకులు, ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరేషాన్ 
  • సైబర్ దాడి కాదు.. సర్వర్ల సమస్యే: మైక్రోసాఫ్ట్
  • పెండింగ్ మెయిల్స్ కోసం 48 గంటల టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

వాషింగ్టన్: సాఫ్ట్‌‌‌‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం వరకు ఇమెయిళ్లు, టీమ్స్ చాట్‌‌‌‌లు, మీటింగ్‌‌‌‌ తదితర సేవలు నిలిచిపోయాయి. ఈ అంతరాయం ఆసియా నుంచి అమెరికా వరకు అన్ని రంగాలను అస్తవ్యస్తం చేసింది. ఏకంగా 74 దేశాలకు విస్తరించిన ఈ సాంకేతిక సమస్య కారణంగా మిలియన్ల కొద్దీ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

దాదాపు 20 గంటల పాటు కొనసాగిన ఈ అంతరాయం పలు వ్యాపారాలు, ప్రభుత్వ సంస్థలు, ఆరోగ్య సంరక్షణ సేవలు, పాఠశాలలు, చివరికి మైక్రోసాఫ్ట్ ఉద్యోగులను కూడా ప్రభావితం చేసింది. గురువారం సాయంత్రం 6 గంటల (జీఎంటీ) ప్రాంతంలో ఈ అంతరాయం మొదలైంది. సేవా అంతరాయాలను ట్రాక్ చేసే 'డౌన్ డిటెక్టర్' వెబ్‌‌‌‌సైట్, మైక్రోసాఫ్ట్ 365 గురించిన ఫిర్యాదులలో ఒక్కసారిగా తీవ్ర పెరుగుదలను నమోదు చేసింది. 

అయితే, ఈ అంతరాయానికి ఎలాంటి సైబర్ దాడి కారణం కాదని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది. సేవలను పూర్తిగా సాధారణ స్థితికి తీసుకురావడానికి మైక్రోసాఫ్ట్ ఇంజనీర్లు యుద్ధప్రాతిపదికన చర్యలు కొనసాగిస్తున్నారని వివరించింది. కాగా, 2024 నాటి ‘క్రౌడ్‌‌‌‌స్ట్రైక్’ ఉదంతాన్ని తలపించే ఈ ఘటన.. డిజిటల్ యుగంలో టెక్నాలజీపై అతిగా  ఆధారపడటాన్ని మరోసారి ప్రశ్నార్థకం చేసింది.

ఏంజరిగిందంటే..

మైక్రోసాఫ్ట్ 365 ప్లాట్‌‌‌‌ఫారమ్‌‌‌‌లోని ఎక్స్ఛేంజ్ ఆన్‌‌‌‌లైన్ సేవల్లో ఈ సాంకేతిక సమస్య తలెత్తింది. ముఖ్యంగా ఔట్​లుక్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, ఏఐ అసిస్టెంట్ ‘కోపైలట్’ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. సర్వర్లలో సురక్షిత కనెక్షన్లను ఏర్పాటు చేసే ప్రాసెస్ ఓవర్‌‌‌‌హెడ్ కావడంతో ఈ సమస్య తలెత్తిందని కంపెనీ తెలిపింది. అకస్మాత్తుగా పెరిగిన లోడ్ కారణంగా సర్వర్లు రిక్వెస్ట్‌‌‌‌లను ప్రాసెస్ చేయలేకపోయాయి. అయితే, దీని వెనుక ఎలాంటి సైబర్ దాడి లేదా హానికరమైన ఉద్దేశాలు లేవని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది.

48 గంటలకు పెరిగిన టైమ్‌‌‌‌అవుట్ విండో

సమస్యను పరిష్కరించడానికి ఇంజనీర్లు చేపట్టిన తొలి దశ మార్పులు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. సర్వర్ల స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి రౌటింగ్ మార్పులు, ట్రాఫిక్ థ్రోట్లింగ్ వంటి చర్యలు చేపడుతున్నారు. అయితే, పెండింగ్‌‌‌‌లో ఉన్న ఇమెయిళ్లను సురక్షితంగా డెలివరీ చేయడానికి తగిన సమయం పట్టే అవకాశం ఉన్నందున.. మైక్రోసాఫ్ట్ ఇమెయిల్ డెలివరీ కోసం టైమ్‌‌‌‌అవుట్ విండోను ఏకంగా 48 గంటలకు పొడిగించింది.

ఎక్కడెక్కడ ఎంత ప్రభావమంటే..

ఈ గ్లోబల్ టెక్ అంతరాయం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ కార్యకలాపాలు, వ్యాపార సంస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

బ్రిటన్ (యూకే): నేషనల్ హెల్త్ సర్వీస్ సిబ్బంది ఆన్‌‌‌‌లైన్ రికార్డులు నిలిచిపోవడంతో తిరిగి పాత పద్ధతిలో పేపర్ రికార్డులను ఆశ్రయించాల్సి వచ్చింది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కార్యకలాపాలకు కూడా అంతరాయం ఏర్పడింది.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్: ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీస్, డిపార్ట్‌‌‌‌మెంట్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్, ‘సర్వీస్’ వంటి ప్రభుత్వ విభాగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. న్యూజిలాండ్‌‌‌‌లో ఇమ్మిగ్రేషన్ వీసా దరఖాస్తుల ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది.
జపాన్: ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖతో పాటు ప్రభుత్వ ఐటీ మౌలిక సదుపాయాలపై తీవ్ర ప్రభావం పడింది.

థర్డ్-పార్టీ ఏఐ సంస్థలు: మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌పై ఆధారపడే ప్రముఖ ఏఐ సంస్థలైన ‘ఓపెన్‌‌‌‌ఏఐ’, ‘ఆంత్రోపిక్’ ల కనెక్టివిటీ టూల్స్ కూడా దెబ్బతిన్నాయి.
 భారతదేశం: ఎయిర్ ఇండియా, ఇండిగో వంటి ప్రముఖ విమానయాన సంస్థలు తమ ఇమెయిల్ సపోర్ట్ సేవలకు అంతరాయం ఏర్పడిందని, కస్టమర్ల విచారణల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సి వచ్చిందని తెలిపాయి.