పదేండ్ల పాలనపై కేటీఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలి :పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

పదేండ్ల పాలనపై కేటీఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలి :పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
  • భారత్ సమిట్ సక్సెస్‌ను ఓర్వలేకే విమర్శలు చేస్తున్నారు: మహేశ్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: విమర్శలు చేసే ముందు గత బీఆర్ఎస్ ప్రభుత్వ పదేండ్ల పాలనలో ఇచ్చిన హామీలు, వాటి అమలుపై కేటీఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ హితవు పలికారు. శుక్రవారం హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. దళితుడిని సీఎంని చేస్తానని హామీ ఇచ్చి, డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి రాత్రికి రాత్రే తొలగించిన చరిత్ర బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీది అన్నారు. హైడ్రా పేరుతో ఇండ్లను కూల్చివేస్తున్నారంటూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ఒక్క ఇల్లు కూల్చినట్లు నిరూపించినా తాను చర్చకు సిద్ధంగా ఉన్నానని ఆయన సవాల్ విసిరారు. బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రజాదరణ తగ్గిపోతోందనడానికి ఇటీవల నిర్మల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన సభ నిదర్శనమని పేర్కొన్నారు. భారత్ సమ్మిట్ విజయాన్ని చూసి ఓర్వలేకే బీఆర్ఎస్ నేతలు రాజకీయాలు చేస్తున్నారని, వారి విమర్శలు అసూయతో కూడుకున్నవని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం జర్నలిస్టుల వీసాలను రద్దు చేయడంపై ప్రపంచంలోని మీడియా ప్రతినిధులంతా ఖండించాలని కోరారు.

రాహుల్ ఫోన్​ను మోదీ ట్యాప్​ చేస్తున్రు 

రాహుల్ గాంధీ ఫోన్‌ను ప్రధాని మోదీ ట్యాప్ చేయిస్తున్నారని, దీనిపై రాహుల్ చేసిన సవాల్‌ను స్వీకరించాలని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ డిమాండ్ చేశారు. పక్కా ఆధారాలతోనే రాహుల్ గాంధీ ఈ ఆరోపణలు చేశారని, దీనిపై వెంటనే విచారణ జరిపించాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఒక్కటేనని ఆరోపించారు. గతంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ చేసిన పనులనే ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తున్నదని ఆయన విమర్శించారు.