న్యూఢిల్లీ: జాకిర్ నాయక్‌‌‌‌ ఫౌండేషన్‌‌‌‌ పై మరో ఐదేళ్లు బ్యాన్

న్యూఢిల్లీ:  జాకిర్ నాయక్‌‌‌‌ ఫౌండేషన్‌‌‌‌ పై మరో ఐదేళ్లు బ్యాన్

న్యూఢిల్లీ: జాకిర్ నాయక్‌‌‌‌కు చెందిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్‌‌‌‌ (ఐఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌)పై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఐదేండ్లు పొడిగించింది. దేశ భద్రతకు ముప్పు కలిగించడంతో పాటు శాంతి, మత సామరస్యానికి భంగం కలిగించేలా సంస్థ కార్యకలాపాలు ఉన్నాయని కేంద్ర హోంశాఖ పేర్కొన్నది. ఈమేరకు చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ)-1967 కింద గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 

పాత నిషేధం నవంబర్ 14తో ముగియనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నది. జాకిర్ నాయక్ తన ప్రసంగాలు, ప్రకటనల ద్వారా మతాల మధ్య విద్వేషాలు, శత్రుత్వాన్ని రెచ్చగొడుతున్నారని కేంద్రం ఆరోపించింది. దేశంతో పాటు విదేశాల్లోని యువతను ఉగ్రవాద కార్యకలాపాల వైపు ప్రోత్సహించేలా ఆయన ప్రసంగాలు ఉంటున్నాయని పేర్కొన్నది. శాటిలైట్ టీవీ  చానళ్లు, ఇంటర్నెట్, ప్రింట్, సోషల్ మీడియా ద్వారా తీవ్రవాద భావజాలాన్ని ప్రచారం చేస్తున్నారని గెజిట్‌‌‌‌లో వెల్లడించింది.