నవంబర్ 26న మాలల నిరసన ర్యాలీ.. పీపుల్స్ ప్లాజా నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు..

నవంబర్ 26న మాలల నిరసన ర్యాలీ.. పీపుల్స్ ప్లాజా నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు..

ఓయూ, వెలుగు: మాలల హక్కుల పరిరక్షణ ధ్యేయంగా నవంబర్ 26న భారీ నిరసన ర్యాలీ చేపడుతున్నట్లు మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్, గ్రేటర్ హైదరాబాద్ జేఏసీ చైర్మన్ బేర బాలకిషన్, మాల స్టూడెంట్స్ జేఏసీ చైర్మన్ మాదాసు రాహుల్ రావు తెలిపారు.

మాల సామాజిక వర్గానికి జరుగుతున్న తీవ్రమైన అన్యాయంపై ‘రాజ్యాంగాన్ని రక్షించుకుందాం.. రోస్టర్ విధానాన్ని సవరించుకుందాం’ అనే నినాదంతో 26వ తేదీన నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు.

ఈ మేరకు శుక్రవారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. వర్గీకరణ రోస్టర్ విధానంతో మాల సామాజిక వర్గం విద్యా, ఉద్యోగ రంగాల్లో తీవ్రంగా నష్టపోతున్నదని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు.  ప్రణయ్ కుమార్, నామ సైదులు, కొప్పుల అర్జున్, కిషోర్, బత్తుల రమేష్, దిలీప్, దాసరి రవి, రాహుల్, నీలం ప్రవీణ్, మాదాసు స్వామి, సాగర్, శ్రీకాంత్, నిఖిల్, రామకృష్ణ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు