హైదరాబాద్: ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ అభ్యర్థులకు శుభవార్త. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET) నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. టెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ .2027 జనవరి 3 నుంచి 15వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో నిర్వహించనున్నారు.
నవంబర్ 16 నుంచి ఆన్ లైన్ అప్లికేషన్లు..
నవంబర్16 నుంచి తెలంగాణ పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో పూర్తి నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులెటిన్ అందుబాటులోకి రానున్నాయి. అదే రోజు నుంచి అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 10 వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగనుంది.
ముఖ్యమైన తేదీలు..
నోటిఫికేషన్ విడుదల: నవంబర్ 13, 2026
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: నవంబర్ 16, 2026
దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 10, 2026
పరీక్షల తేదీలు: జనవరి 3 నుంచి 15, 2027
పరీక్ష విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)
అధికారిక వెబ్‌సైట్: https://schooledu.telangana.gov.in
టెట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, విద్యార్హతలు, పరీక్ష ఫీజు, సిలబస్, దరఖాస్తు విధానం తదితర వివరాలను అభ్యర్థులు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
టెట్ కోసం ఎదురుచూస్తున్న డీఈడీ, బీఈడీ అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదలైన వెంటనే పూర్తి వివరాలను పరిశీలించి గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని నవీన్ నికోలస్ సూచించారు.
