తిరుమల శ్రీవారి అన్న ప్రసాదం ట్రస్టుకు భారీ కానుక లభించింది. శ్రీవారిపై ఉన్న భక్తిని చాటిచెబుతూ హైదరాబాద్ కు చెందిన భక్తుడు 10 కోట్ల రూపాయలు విరాళంగా అందించారు. 2026 నవంబర్ 13న హైదరాబాద్ కు చెందిన కొడాలి శ్రీకాంత్ అనే భక్తుడు భారీ విరాళం ఇచ్చారు.
శ్రీవారి ఆలయంలోని రంగ నాయకులు మండపంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు 10 కోట్ల రూపాయలు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా దాతను అదనపు ఈవో అభినందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణ పాల్గొన్నారు.
