ఉత్తరప్రదేశ్‌లో కొత్త రాజకీయ కూటమి: హైదరాబాద్ MIM పార్టీ ఆధ్వర్యంలో కీలక మలుపు

ఉత్తరప్రదేశ్‌లో కొత్త రాజకీయ కూటమి: హైదరాబాద్ MIM పార్టీ ఆధ్వర్యంలో కీలక మలుపు

కొన్ని నెలల్లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. అన్ని పార్టీలు వ్యూహాల్లో ఉన్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో పుట్టిన ఎంఐఎం పార్టీ.. ఈసారి యూపీ ఎన్నికలపై ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే మరో పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడి.. రాబోయే యూపీ ఎన్నికల్లో.. అన్ని స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ కూటమిని లీడ్ చేస్తుంది ఎవరో తెలుసా.. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. 

సామాజిక పరివర్తన్ మోర్చా (SPM) పార్టీతో కలిసి ఏఐఎంఐఎం (AIMIM) పార్టీ పని చేయనుంది. ఈ రెండు పార్టీలు కూటమిగా పోటీ చేస్తున్నామని.. సీఎం అభ్యర్థి మాత్రం సామాజిక పరివర్తన్ మోర్చా తరపున చంద్రశేఖర్ ఆజాద్ పేరును ఖరారు చేశారు అసదుద్దీన్ ఓవైసీ. 

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మూడో సారి బీజేపీ అధికారంలోకి రాకుండా ఉండేందుకు సర్వశక్తులు ఒడ్డుతామని.. ఆ క్రమంలోనే ఈ కూటమి ఏర్పడినట్లు వెల్లడించారు ఓవైసీ. యూపీ ప్రజలకు బీజేపీ పార్టీకి ప్రత్యామ్నాయం చూపించబోతున్నాం అని.. ఈసారి గెలుపు కూటమి పార్టీలదే అని ధీమా వ్యక్తం చేశారు అసదుద్దీన్ ఓవైసీ. ఈ క్రమంలోనే కూటమి పార్టీ లక్ష్యాలను వెల్లడించారాయన. వెనకబడిన తరగతులు, దళితులు, అణగారిన వర్గాల సమస్యలపై దృష్టి సారిస్తామని.. కుల, మతాలకు అతీతంగా పేదలు, అణగారిని వర్గాలకు గొంతుకగా.. రాజ్యాధికారం పని చేస్తామని వెల్లడించారు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. 

►ALSO READ | మోడీని ప్రశ్నించిన నార్వే జర్నలిస్ట్‌కు షాక్: హైదరాబాద్ 'భారత్ సమ్మిట్'‌కు రాకుండా వీసా రద్దు

యూపీ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య, విద్యా వ్యవస్థ పతనం, రైతు సమస్యలు ఎక్కువగా ఉన్నాయని.. ఈ అంశాలను ప్రధాన ఎజెండాగా ఉద్యమిస్తామని ప్రకటించారు ఓవైసీ. చంద్రశేఖర్ ఆజాద్‌ను యూపీ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉందని.. మా రెండు పార్టీలు కలిసికట్టుగా పని చేసి కూటమి విజయం కోసం కృషి చేస్తామని.. కూటమి విజయం అంటే ఉత్తరప్రదేశ్ ప్రజల విజయంగా అభివర్ణించారు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. 

కూటమి ఎన్నికల ప్రచారంలో భాగంగా.. 2026, నవంబర్ 26న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు ఓవైసీ. భవిష్యత్ తరాల కోసం రాజకీయం చేస్తాం. మెరుగైన ఉత్తరప్రదేశ్ నిర్మాణం కోసం పాటుపడతాం అనే నినాదంతో ముందుకు వెళతామన్నారు ఓవైసీ.