తమ్మిడికుంట చెరువు అభివృద్ధి కోసం నాగార్జున రెండు ఎకరాలను ఇచ్చారు: సీఎం రేవంత్ 

తమ్మిడికుంట చెరువు అభివృద్ధి కోసం నాగార్జున రెండు ఎకరాలను ఇచ్చారు: సీఎం రేవంత్ 

మాదాపూర్ లో హైడ్రా పునరుద్ధరించిన తుమ్మిడికుంట చెరువును ప్రారంభించారు సీఎం రేవంత్. బుధవారం ( నవంబర్ 11 ) జరిగిన ఈ కార్యక్రమానికి నటుడు అక్కినేని నాగార్జున ప్రత్యేక అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. తమ్మిడికుంట చెరువు అభివృద్ధికి నాగార్జున రెండు ఎకరాలను ఇచ్చారని అన్నారు. అభివృద్ధిలో భాగమయ్యారు కాబట్టే నాగార్జునను సన్మానించామని అన్నారు సీఎం రేవంత్.

హైదరాబాద్ లాంటి ప్రకృతి మరే నగరంలో కనిపించదని.. హైదరాబాద్ లో ఉన్న 1372 చెరువుల్లో 50శాతం కనుమరుగయ్యాయని అన్నారు. చిన్న వర్షానికే రోడ్లపై నీళ్లు, ట్రాఫిక్ జామ్ ఎందుకని ఆలోచన చేయాలని అన్నారు. 

►ALSO READ | మూసీ నదిని ప్రక్షాళన చేయాల్సిందే.. ఏ ఒక్కరికి నష్టం లేకుండా చూసే బాధ్యత నాది: సీఎం రేవంత్

చెరువులు కబ్జా కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతున్నాయని అన్నారు సీఎం రేవంత్. తమ్మిడికుంట పునరుజ్జీవానికి సంకల్పించినపుడు కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదురైందని..చిరకాల మిత్రుడు నాగార్జున పెద్ద మనసు చేసుకొని తమకు సహకరించారని అన్నారు.14 ఎకరాలకు తగ్గినా తమ్మిడికుంట చెరువును 30 ఎకరాలకు పెంచామని అన్నారు సీఎం రేవంత్.