హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ఆత్మకథ (బిలాంగింగ్ : ఏ జర్నీ ఆఫ్ లవ్) ఆధారంగా తెలుగులో సినిమా తెరకెక్కిస్తానని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. బుధవారం (నవంబర్ 11) సంగారెడ్డిలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. సోనియా గాంధీ ఆత్మకథను తెలుగు భాషలో సినిమాగా మారుస్తానని తెలిపాడు. సినిమాకు సంగారెడ్డి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే నిర్మాతలు అని.. ఇందుకోసం డబ్బులు సిద్ధం చేసుకోవాలని సూచించారు.
సోనియా గాంధీది ఒక విజయవంతమైన రాజకీయ జీవితమని.. ప్రజలకు ఆమె జీవిత చరిత్రను సినిమా ద్వారా చూపించాలని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సినిమా షూటింగ్ ప్రారంభిస్తానని తెలిపారు. సోనియా గాంధీకి ప్రధాని కుర్చీపై ఎన్నడూ వ్యామోహం లేదన్నారు. ప్రధాని అయ్యే అవకాశం ఉన్నప్పటికీ రెండుసార్లు పదవిని తృణప్రాయంగా వదిలేశారని చెప్పారు. రాహుల్ ప్రధాని కావాలన్నది సోనియా కోరిక.. సోనియా కోరిక నేరవేర్చేందుకు తామంతా సైనికుల్లా పని చేస్తామని పేర్కొన్నారు.
బిలాంగింగ్ : ఏ జర్నీ ఆఫ్ లవ్ పేరుతో సోనియా గాంధీ తన ఆత్మకథ రాసిన విషయం తెలిసిందే. 2026, నవంబర్ 10న ఈ పుస్తకం విడుదలైంది. రాజీవ్ గాంధీతో పరిచయం, ప్రేమ, పెళ్లి.. ఇండియా రావడం, కళ్ల ముందే భర్త, అత్తను కోల్పోయిన వ్యక్తిగత విషయాలు, పలు రాజకీయా అంశాలను సోనియా తన పుస్తకంలో వివరించారు.
