జ్యోతిష్యం:మీనరాశిలో శని తిరోగమనం.. ఈ ఐదు రాశుల వారు జాగ్రత్త..!

జ్యోతిష్యం:మీనరాశిలో శని తిరోగమనం.. ఈ ఐదు రాశుల వారు జాగ్రత్త..!

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం .. శని దేవుడికి చాలా ప్రాధాన్యత ఉంటుంది.  జాతకంతలో శని వక్రీకరించినప్పుడు.. చాలా ఇబ్బందులు వస్తాయి. ప్రస్తుతం (2026  నవంబర్​ 10 నాటికి) శని దేవుడు మీన రాశిలో వక్రగమనంలో సంచరిస్తున్నాడు. ఇదే రాశిలో ఈ స్థితిలో డిసెంబర్​ 11 వ తేది వరకు కొనసాగుతాడు.  ఈ ప్రభావంతో  ఐదు రాశుల వారి విషయంలో తీవ్రమైన ప్రభావం ఉంటుందని పండితులు చెబుతున్నారు  . ఇప్పుడు ఆ రాశుల వారు ఎలా ఉంటుంది.. ఎలాంటి పరిహారాలు చేయాలో  ఈ స్టోరీలో తెలుసుకుందాం. .  .!

వృషభ రాశి: మీన రాశిలో శని తిరోగమనం వలన ..శని  దృష్టి ఈ రాశి వారికి మూడవ స్థానంపై ఉంది.  దీని ప్రభావం అనుకున్న పనులు పెండింగ్​పడే అవకాశం ఉంది.  ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల  ఉన్నప్పటికి ఖర్చులు కూడా పెరుగుతాయి. కొత్త పెట్టుబడులు విషయంలో ఆలోచించి నిపుణుల సలహా ప్రకారం నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. కోపం.. ఆవేశం తగ్గించుకోవాలని పండితులులు సూచిస్తున్నారు.    ఎవరికి అప్పులు ఇవ్వవద్దు. ఆహార విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కేరీర్​ విషయంలో కొన్ని ఆటంకాలు ఏర్పడుతాయి. ఆర్థికవిషయాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. వృత్తి పరంగా.. వ్యాపార పరంగా కొన్ని ఆటంకాలు కలుగుతాయి. ప్రతి విషయంలో కూడా ఓర్పు.. సహనం పాటించండి. అనవసర విషయాల జోలికి వెళ్లవద్దని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. 

పరిహారం:  శనివారం నువ్వుల నూనెతో అభిషేకం.. మంగళ వారం ఆంజనేయ స్వామికి 108 ప్రదక్షిణాలు


మిథున రాశి: ఈ రాశిజాతకులకు శని భగవానుడు ఎనిమిదవ స్థానం వైపు చూస్తున్నాడు. దీని ప్రభావంవలన ఈ రాశివారికి  ప్రతికూల ఫలితాలుంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  కొన్ని వ్యవహారాలలో తీసుకున్న నిర్ణయాల గురించి పునరాలోచన చేయడం మంచిది. వ్యాపారస్తులకు ఆశించిన ఫలితాలు రావు. వృత్తి , ఉద్యోగాలలో ఇబ్బందులు పడే అవకాశం  ఉంటుంది. ఇక ఆర్థిక విషయాలకు వస్తే ఖర్చులు పెరిగే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు . ప్రేమ.. పెళ్లి విషయాలను వాయిదా వేసుకోండి. 

పరిహారం: బ్రాహ్మణులకు శని వారం స్వయంపాకం, శనిభగవానుడికి తైలాభిషేకం

కన్యా రాశి: శని భగవానుడు మీనరాశితో తిరోగమనంలో సంచరిస్తున్నాడు. ఈ రాశి జాతకులకు శని భగవానుడు  ఏడవ స్థానం వైపు చూస్తున్నాడు.  ఇంట్లో కుటుంబసభ్యుల మధ్య అవగాహనలోపంతో అభిప్రాయ బేధాలు వచ్చే అవకాశం ఉంది.   కంటి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.  ఏదో తెలియని విషయం మనసును కలవరపెడుతుంది. ఉద్యోగస్తులు మీ పని మీరు చేసుకోండి.  ఎవరితోను ఎలాంటి వాదనలు పెట్టుకోవద్దు. వ్యాపారస్తులకు ఈ వారం కొత్త పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. వ్యాపార భాగస్వామ్యాలకు సంబంధించిన విషయాల్లో అడుగులు జాగ్రత్తగా వేయాలి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు ఏ మాత్రం మంచిది కాదు. ఉద్యోగస్తులపై బాధ్యతల భారం పెరిగే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

►ALSO READ | కార్తీకమాసం: ప్రకృతికి పూజ..రుబ్బురోలుకు అర్చన.. పార్వతిదేవి చేసింది కూడా ఇదే..!

పరిహారం:  సోమవారం శివుడికి అభిషేకం.. గురువారం దక్షిణామూర్తి స్త్రోత్రం పారాయణం,, పేదలకు అన్నదానం


ధనుస్సు రాశి: శని భగవానుడి దృష్టి ఈ రాశి జాతకులకు 10 వస్థానంలో ఉంది. దీని ప్రభావం వలన ఈ రాశి వారికి కొంత ఒత్తిడితో కూడిన మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు చిన్నపాటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది.  ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది కానీ అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ పెద్దలతో అభిప్రాయ భేదాలు వస్తాయి.  ఇతరులతో మాట్లాడేడప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.   జీవిత భాగస్వామి సలహా.. సంప్రదింపులను పాటించండి.  ఉద్యోగస్తులకు ఆఫీసులో పనిభారం పెరుగడంతో పాటు... కుటుంబ బాధ్యతలు కూడా పెరుగుతాయి.ప్రేమ వ్యవహారాలను వాయిదా వేయాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

పరిహారం: బుధవారం వినాయకుడికి గరిక సమర్పించండి.. శనివారం తైలాభిషేకం.. నువ్వులదానం

మీన రాశి:  ఇదే రాశిలో శని తిరోగనమంలో సంచరిస్తున్నాడు.ప్రతి పనిలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.ఉద్యోగస్తులు .. మీ ప్రమేయం లేకపోయినా అవమానాలు ఎదుర్కొనే అవకాశం ఉంది . అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో చికాకు వాతావరణం ఉంటుంది. వ్యాపారస్తులు అధికంగా శ్రమ పడాల్సి ఉంటుంది.  కొత్తగా పెట్టుబడులు పెట్టే విషయాన్ని వాయిదా వేసుకోవడం చాలా మంచిదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు

పరిహారం: శివాలయంలో దీపారాధనకు నువ్వులనూనె సమర్పణ. శనివారం కాకికి ఆహారం.. పేదలకు బెల్లం, నువ్వులు పంపిణి.. అవసరమైన వారికి శక్తికి తగిన విధంగా ధనసాయం

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.