Health Tips: చిటికెడు ఇంగువ.. బోలెడు లాభాలు..!

Health Tips:  చిటికెడు ఇంగువ.. బోలెడు లాభాలు..!

ఇంగువ చేసే మేలు అంతా ఇంతా కాదు. రసం, సాంబారు, పచ్చళ్లు, తాలింపుల్లో మాత్రమే దీన్ని వాడుతుంటారు చాలామంది. కానీ అన్ని కూరల్లో ఇంగువ వేసి తింటే ఆరో గ్యానికి చాలామంచిది. ఇంగువతో ఎన్ని లాభాలో ఒకసారి చూద్దాం...

ఇంగువకు మంచి వాసన ఉంటుంది. ఇది కూరల్లో చేర్చితే మంచి రుచిని కూడా ఇస్తుంది. ఇంగువలో ప్రత్యేక వైద్య గుణాలున్నాయి.  ఇంగువ శరీర ఉష్ణాన్ని తగ్గిస్తుంది. అజీర్తికి చెక్ పెడుతుంది. రుచిని పెంచుతుంది. వాతాన్ని, కఫాన్ని నిరోధిస్తుంది. పిత్తాన్ని దూరం చేస్తుంది. కడుపు ఉబ్బరం, పొట్ట పేగుల్లోని బ్యాక్టీరియాను నశింపజేస్తుంది.

  • ఇంగువను రెగ్యులర్ గా తింటే గ్యాస్, కడుపు నొప్పిలాంటి సమస్యలు తగ్గుతాయి.
  • యాంటీ బయాటిక్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ ఫ్లమేటరీలు ఇంగువలో ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి, దీన్ని రెగ్యులర్ గా తినడం వల్ల శ్వాస సమస్యలు ఉండవు.
  • వేడి నీళ్లలో చిటికెడు ఇంగువ కలిపి తాగితే తలనొప్పి మాయమవుతుంది.
  • కడుపులో నులిపురుగుల సమస్య ఉన్నా వాముతో కలిపి తింటే తగ్గుతుంది.
  • వారానికి రెండుసార్లు అన్నంలో మొదటి ముద్ద నెయ్యి, వాము, ఇంగువతో కలిపి తింటే జీర్ణ సమస్యలుండవు.
  • దగ్గును దరిచేరనివ్వదు. 
  •  శ్వాస సమస్యలను దూరం చేస్తుంది.
  •  నరాల బలహీనతకు చెక్ పెడుతుంది. 
  • మూర్ఛ వ్యాధులను దూరం చేస్తుంది. 
  • మహిళల ఉదరంలో ప్రసవానికి తర్వాత ఉండే మలినాలను వెలివేయడంతో ఇంగువ బాగా పనిచేస్తుంది. 
  •  ఇంగువను నూనెలో కరిగించి చెవుల్లో నాలుగైదు చుక్కలు పోస్తే.. చెవిపోటు తగ్గుతుంది. 
  •  నూనెలో వేయించి ఉపయోగిస్తే.. రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. 
  •  ప్రసవానికి తర్వాత వెల్లుల్లి, పటిక బెల్లం, నూనెలో వేపిన ఇంగువను చేర్చి మహిళలకు ఇస్తే మలినాలను తొలగిపోతాయి.   
  •  ఉబ్బసం, కోరింత దగ్గు, గొంతు బొంగురు, హిస్టీరియా వంటి వ్యాధులకు  ఇంగువ మంచి ఔషధం

►ALSO READ | Bhai Dooj 2026: బొట్టు పెట్టే ముందు పూజా పళ్ళెంలో ఇవి తప్పనిసరిగా ఉండాలి.. మర్చిపోకండి!