జ్యోతిష్యం: తులారాశిలో పెద్ద మార్పు.. బుధుడు సంచరించే దిశ మారింది.. 12 రాశుల ఫలితాలు ఇవే..!

జ్యోతిష్యం:  తులారాశిలో పెద్ద మార్పు.. బుధుడు సంచరించే దిశ మారింది.. 12 రాశుల ఫలితాలు ఇవే..!

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాకుమారుడైన బుధుడు  2026 నవంబర్ 13వ తేదీన రాత్రి సుమారు 9:22 గంటలకు   తన దిశను మార్చుకుంటాడని పండితులు చెబుతున్నారు. తులారాశిలో తిరోగమనంలో  ఉన్న బుధుడు  సవ్య దిశలో ( ప్రత్యక్ష గమనంలోకి (direct motion)) సంచరించడం ప్రారంభిస్తాడు. దీని ప్రభావం అన్ని రాసులపై  ఖచ్చితంగా ఉంటుంది.  12 రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. . .!

 మేష రాశి:  బుధుడు తులారాశిలో సంచరించే దిశను మార్చుకోవడం వలన ఈ రాశి వారికి గతంలో నిలిచిపోయిన పనులు వేగవంతమవుగాయి.భాగస్వామ్య వ్యాపారాల్లో స్పష్టత వస్తుంది. నిరుద్యోగులకు కాలం కలిసివచ్చి జాబ్ సంపాదిస్తారు. వ్యాపారాలు రెట్టింపు లాభాలను ఇస్తాయి. మీ జీవితంలో ఆనందం తాండవిస్తోంది. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు తొలగిపోయి అన్యోన్యత పెరుగుతుంది.  ఉద్యోగస్తులకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్​ తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది. ఎలాంటి ఇబ్బంది ఉండదు.  అంతా మంచిగానే జరిగిపోతుంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి.

వృషభ రాశి:  బుధుడు తులారాశిలో ప్రత్యక్షస్థితిలోకి మారడం వలన ఈ రాశి వారికి ఇప్పటి వరకు ఎదురైన పనుల్లో ఇబ్బందులు తొలగుతాయి.  కోర్టు కేసులు.. రుణాల విషయంలో సానుకూల ఫలితాలుంటాయి. వ్యాపారస్తులు కొత్త పనులు మొదలు పెట్టడానికి  ఇది మంచి సమయమని పండితులు చెబుతున్నారు.  నిరుద్యోగులు గుడ్​ న్యూస్​ వినే అవకాశం ఉంది. ఉద్యోగస్తుల విషయంలో కొంత ఆందోళన ఉంటుంది.  అయినా ఎలాంటి ఇబ్బంది ఉండదు.  వ్యాపారస్తులకు అమితమైన లాభాలు కలుగుతాయి.  ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసివస్తాయి.ఆరోగ్యం మెరుగవుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

 మిథున రాశి: బుధుడి సంచారంలో మార్పు వలన ఈ రాశి వారికి చాలా  ప్రయోజనకరంగా ఉంటుంది. వీరు పట్టిందల్లా బంగారం అవుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మీ లక్ష్యానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి.  ఆర్థికంగా బాగాఅభివృద్ది చెందుతారు.  శుభకార్యం జరిగే అవకాశం ఉంది. మీరు అనుకున్నది సాధిస్తారు. మీకు లక్ కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది.  వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెడితే అనుకోని లాభాలు కలుగుతాయి. మానసిక ఒత్తిడి తగ్గి ఆలోచనల్లో సానుకూలత వస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ వస్తుందని  పండితులు చెబుతున్నారు. 

 కర్కాటక రాశి: బుధుడు తులారాశిలో ప్రత్యక్ష స్థితిలో సంచారం వలన ఈ రాశి వారికి   అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.  గతంలో రావలసిన మొండి బకాయిలు వసూలవుతాయి.  వైవాహిక జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  కెరీర్‌లో పురోగతి సాధించే  అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.  ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు.  వ్యాపారస్తులకు  అధికంగా లాభాలుంటాయి పండితులు సూచిస్తున్నారు.   ఇప్పటివరకు నెలకొన్న కుటుంబ సభ్యుల మధ్య అపార్ధాలు తొలగిపోతాయి. ప్రాపర్టీ కొనుగోలుకు సంబంధించి పనులు వేగవంతమవుతాయి. 

 సింహ రాశి: బుధుడు తులారాశిలో దిశ మారడం వలన ఈరాశి వారికి అన్ని విషయాల్లో ఊహించని లాభాలు కలుగుతాయి.  వృత్తి.. ఉద్యోగం.. వ్యాపారంలో  పురోగతి ఉంటుంది.  ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలతో పాటు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.  ఉన్నతాధికారుల ప్రశంశలు అందుకొనే అవకాశం ఉంది.  అనుకోకుండా  కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడటంతో సంపద పెరుగుతుందని పండితులు చెబుతున్నారు.   సమాజంలో గౌరవం కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.వ్యాపారంలో కొత్త ప్రణాళికలను రూపొందించడానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కెరీర్ మెరుగుదల కోసం మీరు సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభిస్తే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళే అవకాశం పొందుతారు.  తోబుట్టువుల నుంచి సహకారం అందుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

 కన్య రాశి:  బుధుడు సంచారం మార్పు .. ఈ రాశి వారు  ఏ పని తలపెట్టినా ఇబ్బంది లేకుండా  పూర్తవుతుంది.  కష్టానికి తగిన ఫలితం లభిస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది.ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగుతాయి. గతంలో ఆగిపోయిన డబ్బు చేతికి అందే అవకాశం ఉంది. .  ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది.  ఆఫీసర్ల మద్దతు పుష్కలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.  ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో జీత భత్యాలు బాగా పెరుగుతాయి.సమాజంలో మంచి గౌరవం పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని చాలా గౌరవంగా చూస్తారని  పండితులు చెబుతున్నారు.

తులా రాశి: ఇదేరాశిలో బుధుడు వక్రగమనం నుంచి ప్రత్యక్ష మార్గంలో సంచారం ప్రారంభించడం వలన ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కెరీర్ విషయాలో  స్పష్టత వస్తుంది.  వ్యక్తిగత నిర్ణయాల్లో ఆశించిన శుభ ఫలితాలు కనిపిస్తాయి. ఉద్యోగస్తులకు కొత్త బాద్యతలు వచ్చే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల సహకారంతో ముఖ్యమైన పనులను సజావుగా పూర్తి చేయడం సాధ్యమవుతుంది. ధైర్యంతో నిర్ణయాలు తీసుకునే మీ లైఫ్​ టర్నింగ్​ పాయింట్​ అవుతుంది.  రాబోయే రోజుల్లో వృత్తిపరమైన పురోగతికి మంచి అవకాశాలను కల్పించవచ్చు. . ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి.ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి.అప్పుల సమస్యల నుంచి విముక్తి కలిగే అవకాశం ఉంది.  సొంతింటిని ఏర్పరచుకొనేందుకు ప్లాన్​ వేస్తారు.  ఈ రాశి వారికి అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు

►ALSO READ | Bhai Dooj 2026: బొట్టు పెట్టే ముందు పూజా పళ్ళెంలో ఇవి తప్పనిసరిగా ఉండాలి.. మర్చిపోకండి!

 వృశ్చిక రాశి:  బుధుడు తులారాశిలో తిరోగమనం వలన ఈ రాశి వారికి ఉద్యోగ .. వ్యాపారస్తులు  ఆర్థికంగా లాభపడతారు. కుటుంబంలో మంచి వాతావరణం ఏర్పడటంతో మనశ్శాంతి ఉంటుంది.  జీవిత భాగస్వామి సలహా..సూచనలను పాటించాలని పండితులు చెబుతున్నారు.   ఎప్పటి నుంచో పెండింగ్​ లో ఉన్న పనులు పూర్తవుతాయి.  ఖర్చులుపెరిగే అవకాశం ఉంది.  అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విదేశాలకు సంబంధించిన పనుల్లో వేగం వస్తుంది.సమాజంలో గౌరవ.. మర్యాదలు పెరుగుతాయి. పూర్వీకుల ఆస్తి కలసి రావడంతో ఆర్థికంగా బలపడతారు.  ఎవరికి మధ్యవర్తిగాఉండవద్దు.. ఎలాంటి హామీల జోలికి వెళ్లవద్దని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. 

 ధనుస్సు రాశి:  బుధుడి సంచారంలో మార్పు వలన ఈ రాశి వారు అనుకున్న ఫలితాలను సాధిస్తారు. వ్యాపారస్తులు సామాన్య లాభాలను పొందుతారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. . నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ ఆఫర్లు లభించే అవకాశం ఉంది.  కొత్తగా పెట్టుబడులు పెట్టేవారికి ఇది అనుకూల సమయంకాదని పండితులు చెబుతున్నారు. అనుకోకుండా దూరపు ప్రయాణాలు చేస్తారు. కుటుంబసభ్యుల మధ్య సఖ్యత ఏర్పడటంతో మాసనికంగా సంతోషంగా గడిపే అవకాశం ఉందని  జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.   స్నేహితుల నుంచి సహాయం అందుతుంది.  కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయని పండితులు చెబుతున్నారు. 

 మకర రాశి: ఈ రాశి వారికి బుధుడి సంచారంలో మార్పువలన ఈరాశి వారికి అన్ని విధాల సానుకూల ఫలితాలు కలుగుతాయి.   జీవితంలో స్థిరత్వం పొందే అవకాశం ఉంది.  ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది.  వృత్తి పరంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి.  ఏ పని చేసినా కలసి వస్తుంది. అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి. మొండి బాకీలు అనుకోకుండా వసూలవుతాయి.  మానసిక ప్రశాంతత లభిస్తుంది.  ఉద్యోగస్తులు కార్యాలయంలో కీలక పాత్ర పోషిస్తారు.  ఉద్యోగులకు తమ సామర్థ్యాలను నిరూపించుకోవడానికి, కొత్త ప్రాజెక్టులలో పాలుపంచుకోవడానికి అవకాశం లభించే అవకాశం ఉంది.  వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు

 కుంభ రాశి: తులారాశిలో బుధుడు తన దిశను మార్చుకోవడం వల న ఈ రాశి వారికి  అదృష్టం కలసి రావడంతో  అన్ని విషయాల్లో సానుకూల పరిణామాలు చోటుచేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు రెట్టింపవుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి.  ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. .  ప్రభుత్వ ఉద్యోగం ఎదురు చూసే వారు గుడ్ న్యూస్ వింటారు.   ఎప్పటి నుంచి పెండింగ్ లో ఉన్న పనులు పరిష్కారమవుతాయి. జాయింట్ వ్యాపారాలు కలసివస్తాయి.  ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్ లభిస్తుంది. పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి ఆశించిన సంబంధం కుదురుతుంది. చేతి వృత్తుల వారికి అధికంగా ఆర్డర్లు రావడంతో కష్టాలు తీరతాయని పండితులు చెబుతున్నారు. 

 మీన రాశి: బుధుడి సంచారంలో మార్పు వలన ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. కేరీర్​లో హెచ్చు తగ్గులుంటాయి.  అయినా మీ పనితీరుతో  అధికారులు బాగా సంతృప్తి చెందుతారు. పెండింగ్​ లో ఉన్న ప్రాజెక్ట్​లను పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి.ఉద్యోగంలో అధికారులు మీ పనితీరుతో బాగా సంతృప్తి చెందుతారు.  ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. . నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ వస్తుంది. ఆర్థికపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.