చెన్నూరులో విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎన్ని నిధులు వెచ్చించడానికైనా సిద్ధం: ఎంపీ వంశీ

చెన్నూరులో విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎన్ని నిధులు వెచ్చించడానికైనా సిద్ధం: ఎంపీ వంశీ

మంచిర్యాల: చెన్నూరులో విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎన్ని నిధులు వెచ్చించడానికైనా సిద్ధమని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రకటించారు. మంగళవారం (నవంబర్ 10) మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్‎లో 320 మంది విద్యార్థులకు విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంపీ వంశీ స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. 

అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన తండ్రి, మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవతో చెన్నూరు నియోజకవర్గం లో 10 కోట్ల రూపాయల అభివృధి పనులు కేవలం విద్య కోసమే కేటాయించారని తెలిపారు. 

సోమనపల్లి గ్రామంలో 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. త్వరలో చెన్నూరులో వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‎తో నాణ్యమైన విద్య అందిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యా రంగంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు.