రంగారెడ్డి కలెక్టర్కు ఆరు నెలల జైలు..

రంగారెడ్డి కలెక్టర్కు ఆరు నెలల జైలు..
  •  కోర్టు ఉత్తర్వులను నారాయణరెడ్డి ధిక్కరించారన్న హైకోర్టు
  •  రూ. 2 వేల జరిమానా.. 
  • అప్పీల్ కోసం శిక్ష అమలు 4 వారాలు నిలిపివేత  
  •  తుర్కయాంజల్ ప్లాట్ల వివాదంలో ఉన్నత న్యాయస్థానం తీర్పు
  •  మరో ధిక్కరణ కేసులో ముగ్గురు 
  • రిజిస్ట్రేషన్ ​అధికారులకూ జైలు

హైదరాబాద్, వెలుగు: హైకోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందుకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సి.నారాయణరెడ్డికి 6 నెలల సాధారణ జైలుశిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. అయితే, ఈ తీర్పుపై అప్పీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాఖలు చేసుకునేందుకు వీలుగా జైలుశిక్ష అమలును 4 వారాలపాటు నిలిపివేసింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలం తుర్కయాంజల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలోని మన్నె ముత్యాలమ్మ కుంట ప్రాంతంలో సర్వే నంబర్లు 536, 537, 657, 658లలో ఉన్న ప్లాట్లకు సంబంధించి వివాదం తలెత్తింది. 

పిటిషనర్లకు చెందిన ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 59, 62 తూర్పు భాగాన్ని నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించాలంటూ 2024 మార్చి 14న చేసిన విజ్ఞప్తిని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని 2025 ఆగస్టు 5న హైకోర్టు ఆదేశించింది. అభ్యర్థనను తిరస్కరిస్తే కారణాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేయాలని, ఆ ప్రక్రియను ఉత్తర్వుల ప్రతులు అందిన 60 రోజుల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఆగస్టు 11న ఉత్తర్వుల ప్రతులు అందినప్పటికీ గడువులోగా కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్ణయం తీసుకోలేదు. దీంతో పిటిషనర్లు 2025 అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 15న కోర్టు ధిక్కరణ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేశారు. కోర్టు నోటీసుల తర్వాత 2026 ఫిబ్రవరి 26న అభ్యర్థనను తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పునఃపరిశీలించాలని హైకోర్టు ఆదేశించిన అనంతరం జులై 8న మరోసారి తిరస్కరణ ఉత్తర్వులు ఇచ్చారు. 

అయితే, ఇదే లేఅవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని పక్కనే ఉన్న ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 62 పడమర భాగంతోపాటు మరో రెండు ప్లాట్లను 2022లోనే నిషేధిత జాబితా నుంచి తొలగించిన విషయాన్ని హైకోర్టు ప్రస్తావించింది. ఒకే లేఅవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని పిటిషనర్ల ప్లాట్ల విషయంలో భిన్నమైన వైఖరి అవలంబించడానికి సరైన కారణాలు చూపలేదని పేర్కొంది. సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 537ను జాబితా నుంచి తొలగించి, మిగిలిన సర్వే నంబర్లను కొనసాగించడంపై కూడా కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వివరణ ఇవ్వలేకపోయారని తెలిపింది. భూ సంస్కరణల చట్టం ప్రకారం భూముల అప్పగింత ప్రక్రియ పూర్తికాలేదన్న కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాదనలను ధిక్కరణ విచారణలో పరిశీలించలేమని స్పష్టం చేసింది. 

గత ఉత్తర్వులు తప్పని భావిస్తే అప్పీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేదా ఇతర చట్టబద్ధ మార్గాలను ఆశ్రయించాలే తప్ప, వాటిని అమలు చేయకుండా ఉండటానికి వీల్లేదని తేల్చిచెప్పింది. ఉద్దేశపూర్వకంగా కోర్టు ఉత్తర్వులను ధిక్కరించినట్లు నిర్ధారిస్తూ జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కె.లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోర్టు ధిక్కరణ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అనుమతించారు. నాలుగు వారాల్లో జరిమానా చెల్లించాలని, జైలుశిక్ష అమలును అప్పీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకునేందుకు వీలుగా 4 వారాలు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.