ఆదివారం దీపావళి, దానికి ముందు వచ్చిన ధనత్రయోదశికి తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా భారీ అమ్మకాలు జరికాయి. జ్యువెలరీ వ్యాపారుల అంచనాల ప్రకారం ఈసారి దాదాపు రూ.70వేల కోట్లకు పైనే బిజినెస్ జరిగిందని అంచనా. అయితే పండుగకు ముందు కొంత రేట్లు తగ్గుదలతో కొనుగోలుదారులు షాపులకు క్యూ కట్టినప్పటికీ పండుగ అవ్వగానే మళ్లీ బంగారం రేట్లు పైపైకి చేరుకుంటున్నాయి. కార్తీకమాసం మెుదలవ్వగానే షాపింగ్ చేయాలనుకుంటున్న తెలుగు ప్రజలు ముందుగా తమ నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలించటం బెటర్.
నవంబర్ 9న బంగారం రేట్లు పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు 103 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 460గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 255గా కొనసాగుతోంది.
ALSO READ : 120 నగరాల్లో నిమిషాల్లో హోం డెలివరీలు
సోమవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. నవంబర్ 9, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కూడా స్వచ్ఛమైన వెండి కేజీకి రూ.2లక్షల 5 వేలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.205 దగ్గర ఉంది.
