ఎల్ నినో ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి.. రిజర్వాయర్లు డెడ్ స్టోరేజికి దగ్గర్లో ఉన్నాయి..నీటిని పొదుపుగా వాడాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. పరిస్థితి ఇలా ఉంటే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. మోటార్ లేకుండానే బోర్ల నుంచి నీరు ఉబికి వస్తున్నాయి. జిల్లాలోని మహదేవపుర మండలం పూసుకుపల్లి శివారులో చోటు చేసుకుంది ఈ ఘటన. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి...
పూసుకుపల్లి శివారులో జరుగుతున్న ఈ ఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎల్నినో ప్రభావంతో వర్షాలు సరిగ్గా కురవక పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గిపోయి బోర్లు ఎండిపోతున్నాయి... దీంతో రైతులు పంటలు పండించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అయితే పూసుకుపల్లి శివారులో గత వర్షాకాలంలో రైతులు వేసిన మూడు బోర్ల నుంచి మోటార్లు ఏర్పాటు చేయకుండానే నీరు ఉబికి వస్తోంది. వర్షాభావ పరిస్థితుల్లోనూ ఈ బోర్ల నుంచి నీరు నిరంతరంగా బయటకు వస్తుండటం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఒకవైపు నీటి కొరతతో పంటలు ఎండిపోతుంటే,మరోవైపు మోటార్ లేకుండానే బోర్ల నుంచి నీరు ఉబికి వస్తుండటం చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు స్థానికులు.
