గచ్చిబౌలి విషాదం: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య...

గచ్చిబౌలి విషాదం: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య...

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆదివారం ( నవంబర్ 8 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. గచ్చిబౌలి లోని గౌలిదొడ్డిలో ఉన్న జయభేరి అపార్ట్మెంట్ సీ బ్లాక్ లో ఫ్లాట్ నంబర్ 702లో చోటు చేసుకుంది ఈ ఘటన. ఈ ఫ్లాట్ లో గత ఏడాదిగా నివాసం ఉంటున్నారు బాతుల మారెడ్డి, ఆయన భార్య భారతి, కొడుకు నిశాంత్ రెడ్డి. ఈ ముగ్గురు ఇవాళ ఉదయం ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు స్థానికులు.

నిశాంత్ రెడ్డి సాఫ్ట్ వేర్ ఉద్యోగి అని సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిశాంత్ రెడ్డి ఫ్యామిలీ గత ఏడాదిగా ఈ ఫ్లాట్ లో ఉంటున్నారని.. అనారోగ్య కారణాలు లేదా కుటుంబ కలహాలే వీరి ఆత్మహత్యకు కారణమై ఉండచ్చని అంటున్నారు స్థానికులు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. స్థానికులు చెబుతున్నట్లుగా అనారోగ్య కారణాలు, కుటుంబకలహాలే ఫ్యామిలీ ఆత్మహత్యకు కారణమా లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.