జ్యోతిష్యం:డబ్బు కష్టాలు వెంటాడుతున్నాయా..నవంబర్8సాయంత్రం ఈ పరిహారాలు చేయండి..!

జ్యోతిష్యం:డబ్బు కష్టాలు వెంటాడుతున్నాయా..నవంబర్8సాయంత్రం ఈ పరిహారాలు చేయండి..!

హిందూ సంప్రదాయం ప్రకారం దీపావళి పండుగను ఈ ఏడాది ( 2026) నవంబర్​ 8 వ తేది అత్యంత వైభవంగా జరుపుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ రోజు ( నవంబర్​ 8) సాయంత్రం (ప్రదోషకాలంలో) కొన్ని ప్రత్యేక ఆచారాలను పాటించాలని పండితులు చెబుతున్నారు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. . .!

చాలామంది ఎంత కష్టపడినా చేతిలో చిల్లిగవ్వ ఉండదు.  చిన్న పని చేయాలన్నా అప్పులు చేయాల్సిర పరిస్థితే ఉంటుంది.  మరి ఆదాయం లేదా అంటే క్షణం తీరిక లేకుండా సంపాదిస్తుంటారు.  అంటే అలాంటి వారికి గ్రహ దోషాల వలన.. పూర్వ జన్మంలో  చేసిన పాపాలు వెంటాడటం ఇలా జరుగుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  

మరి అలా ఇబ్బంది పడే వారు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం దీపావళి పండుగరోజు ( 2026 నవంబర్​8) సాయంత్రం సమయంలో  నాణేలు, గవ్వలు, పసుపు, గోమతి చక్రం, దీపాలతో   కొన్ని ప్రత్యేక ఆచారాలను పాటిస్తే  దోషాలకు విముక్తి కలిగి..క్రమేణ ఆర్థిక బాధలు తొలగుతాయని పండితులు చెబుతున్నారు.

హిందూ పురాణాల ప్రకారం  దీపావళి రోజు ప్రదోషకాలం నుంచి  రాత్రి వరకు  లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి భక్తులను సుఖసంతోషాలు, ఐశ్వర్యంతో ఆశీర్వదిస్తారనిపండితులు చెబుతున్నారు. అందుకే ఈ రోజున ఇళ్లను శుభ్రం చేసి, దీపాలతో అలంకరించి లక్ష్మీపూజ నిర్వహిస్తారు. పూజలు, దీపారాధనతో పాటు ఆర్థిక ఇబ్బందులు తొలగి, ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు కలగాలని కోరుకుంటూ కొన్ని ప్రత్యేక ఆచారాలను కూడా పాటిస్తారు. 

  నాణెంతో చేసే ఆచారం:  దీపావళి రోజు సాయంత్రం  సమయంలో  రావి, ఉసిరి లేదా మారేడు  చెట్టుకు ప్రదక్షిణలు చేసి  నమస్కరించాలి.  అనంతరం ఇంటికి వచ్చి లక్ష్మీపూజ చేసిన ప్రదేశంలో పూజలో ఉపయోగించిన ఒక రూపాయి లేదా వెండి నాణెన్ని  డబ్బును  దాచే ప్రదేశంలో ఉంచాలి. ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయని పండితులు చెబుతున్నారు.

చీపురు కింద నాణెం: దీపావళి రోజు రాత్రి సమయంలో నిద్రపోయే ముందు చీపురు కింద ఒక రూపాయి లేదా వెండి నాణెం ఉంచాలి.  ఇలా చేయడం వలన ఇంట్లో ప్రతికూలత తొలగి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.

 గవ్వలు, పసుపుతో పరిహారం: ఐదు  పోకచెక్కలు, నల్ల పసుపు, ఐదు గవ్వలను గంగాజలంతో శుద్ధి చేసి ఎర్రటి వస్త్రంలో కట్టాలి. అనంతరం లక్ష్మీపూజ సమయంలో వీటిని వెండి గిన్నెలో ఉంచి పూజించి..  మరుసటి రోజు డబ్బు దాచే ప్రదేశంలో భద్రపరచుకోవాలి. 

 గోమతి చక్రంతో ఆచారం: ఐదు పోకచెక్కలు, ఐదు  పసుపు ముద్దలు, ఐదు గవ్వలు, ఐదు గోమతి చక్రాలను ఎర్రటి వస్త్రంలో కట్టి లక్ష్మీపూజ స్థలంలో ఉంచుతారు. పూజ అనంతరం వాటిని  ఇంటి గుమ్మానికి.. వ్యాపార ప్రదేశంలో మెయిన్​ డోర్​కు కట్టాలి.  ఇలా  చేయడం వలన దిష్టి దోషాలు తొలగి.. ప్రతి కూల శక్తి తొలగి పోతుంది. ఇలా చేస్తే డబ్బు రాకుండా అడ్డుపడే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి.

 రావి చెట్టు వద్ద దీపం: దీపావళి రోజు ప్రదోషకాలంలో  రావి చెట్టు మొదలు దగ్గర కుంకుమ, పెరుగు, మినపపప్పు సమర్పించి ఆవు నెయ్యి దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలు తొలగుతాయని జ్యోతిష్యపండితులు చెబుతున్నారు. ఇలాంటి పనులు దీపావళి రోజు ప్రదోషకాలంలో చేయడం వలన ఎల్లప్పుడూ డబ్బులకు లోటు ఉండదని ఉంటుందని పండితులు చెబుతుంటారు.

 మరికొన్ని ఆచారాలు

  • లక్ష్మీపూజ అనంతరం ఇంట్లో శంఖం ఊదడం,
  •  గంట మోగించడం ద్వారా ప్రతికూలత తొలగుతుంది
  •  లక్ష్మీదేవి ముందు నెయ్యితో  దీపం వెలిగించడం వలన ఆరోగ్యం, ఐశ్వర్యం, దీర్ఘాయువుకు శుభప్రదం
  • దీపావళి రోజు సాయంత్రం లక్ష్మీ పూజ తరువాత  “ఓం నమః భాగ్యలక్ష్మీ చ విద్మహే...అష్టలక్ష్మీ చ ధీమ... యహి, తన్నో లక్ష్మీ ప్రచోదయాత్” అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.