120ఏళ్లు పాలన చేసినా.. గాంధీ, అంబేద్కర్, నెహ్రూల్లా.. మోదీ గొప్పవ్యక్తి కాలేడు: అభిజిత్ దీప్కే 

120ఏళ్లు పాలన చేసినా.. గాంధీ, అంబేద్కర్, నెహ్రూల్లా.. మోదీ గొప్పవ్యక్తి కాలేడు: అభిజిత్ దీప్కే 

ప్రధాని మోదీపై సీజేపీ చీఫ్​ అభిజిత్ దీప్కే తీవ్ర విమర్శలు గుప్పించారు.  పన్నేండ్లుగా పాలన చేస్తున్న మోదీ.. ఇంకా 120 యేళ్లు పాలన చేసినా  గొప్ప వ్యక్తి కాలేరని అన్నారు. దేశంకోసం గాంధీ, అంబేద్కర్​, నెహ్రూలాంటి మహనీయులు  పోరాటం చేశారు. ఆ సమయంలో  మోదీకి ఎందిన సంస్థ బ్రిటీష్​ పాలకులకు సేవ చేస్తోందన్నారు.  కేరళలో కాక్రోచ్​ పార్టీ ఆధ్వర్యంలో  సీఈసీ జ్ణానేష్ కుమార్​ కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు ప్రారంభమైన సందర్బంగా దీప్కే వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.  

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా శనివారం (నవంబర్ 7) సాయంత్రం కొచ్చిలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనలు చేపట్టింది. పెద్ద సంఖ్యలో నిరసనకారులు కాక్రోచ్‌ల వేషధారణలో సమావేశమై ఆందోళన నిర్వహించారు. పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఈ నిరసనల్లో పాల్గొని ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు.

దీప్కే మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ఇప్పటికే 12 ఏళ్లుగా అధికారంలో ఉన్నారని, మరో 120 ఏళ్లు పాలించినా గాంధీ, అంబేద్కర్, నెహ్రూల స్థాయికి చేరుకోలేరని దీప్కే అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఆ మహనీయులు పోరాడుతున్న సమయంలో, మోదీకి చెందిన సంస్థ బ్రిటిష్ వలస పాలకులకు సేవ చేస్తోందని ఆరోపించారు. బ్రిటిష్ పాలకుల బూట్లు శుభ్రం చేయడంలోనే అప్పట్లో వారు బిజీగా ఉన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.కాగా, సీఈసీ  జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఈ నిరసనలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.