బ్యాంక్ ఆఫ్ బరోడాలో 837 ఉద్యోగాలు.. డిగ్రీ ఉంటే చాలు.. నవంబర్ 24 వరకు ఛాన్స్!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 837 ఉద్యోగాలు.. డిగ్రీ ఉంటే చాలు.. నవంబర్ 24 వరకు ఛాన్స్!

ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఒక్కటైన బ్యాంక్ ఆఫ్ బరోడా వెల్త్ మేనేజ్‌‌‌‌మెంట్ సర్వీసెస్ (WMS)  డిపార్ట్​మెంట్‌‌‌‌లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌‌‌‌మెంట్ డ్రైవ్ ద్వారా దేశవ్యాప్తంగా 837 ఖాళీలను భర్తీ చేయనున్నారు.   

పోస్టు పేరు: సీనియర్ రిలేషన్‌‌‌‌షిప్ మేనేజర్ (డిప్యూటీ మేనేజర్)

మొత్తం ఖాళీలు: 837.

విభాగాల వారీగా ఖాళీలు: గ్రూప్ హెడ్ 8, హెడ్ ఇన్వెస్ట్​మెంట్ 1, టెర్రిటరీ హెడ్ 35,  ఇన్వెస్ట్​మెంట్ ప్రొడక్ట్ మేనేజర్ 2, సీనియర్ రీలేషన్​షిప్ మేనేజ్​మెంట్ 791. 

విద్యార్హతలు: పోస్టును బట్టి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీతోపాటు సంబంధిత రంగంలో (వెల్త్ మేనేజ్‌‌‌‌మెంట్/ఇన్వెస్ట్​మెంట్ అడ్వైజరీ) అనుభవం, నిర్దేశిత ఎన్ఐఎస్ఎం/ ఐఆర్​డీఏ సర్టిఫికేషన్లు ఉండాలి.

వయసు: 2026, నవంబర్ 1 నాటికి పోస్టును బట్టి అభ్యర్థుల కనిష్ట వయసు 24 సంవత్సరాల నుంచిగరిష్టంగా 50 సంవత్సరాల వరకు నిర్ణయించారు . నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయసులో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: నవంబర్ 4.

అప్లికేషన్ ఫీజు: జనరల్/ అన్ రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.800, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీలు రూ.175 చెల్లించాలి. 

లాస్ట్ డేట్: నవంబర్ 24. 

సెలెక్షన్ ప్రాసెస్: ఆన్​లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ అసెస్ మెంట్, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ bankofbaroda.bank.in ను సందర్శించండి.